పుట:2015.373190.Athma-Charitramu.pdf/560

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 516

నపుడు, "ఇద్దఱు అబ్బావులు, ఒక అమ్మావు !" అని వాఁడు చెప్పి, తన చిన్న పెట్టెలోనుండు మూఁడు బొమ్మలను జూపించుచుండువాఁడు !

లోకమును వట్టికలఁ జేసి, మమ్ము దు:ఖతోయములఁ ద్రోచివైచి, యిపు డీపిల్లవాఁడు వెడలిపోయెను ! ఊరక యుండువారలకు పుత్రమోహమును గలిపించి, వెనువెంటనె యాశాభంగము గావించి, వీఁడు దాఁటిపోయెను ! వీనిని గుఱించి తలపోయునపుడు, నాతల దిర్దిర తిరిగిపోవుచుండెను ! లోక మంధకారబంధుర మగుచుండెను ! ఎంత బలహీనుఁ డైనను, ఇంతలో వాఁడు చనిపోవునని నే ననుకొనలేదు ! ఏచికిత్సలొ చేసి, ఏసాధనములొ గలిపించి, మెల్లగ వాని శరీరమున జవచేరు ప్రయత్నములు చేయుచుంటిమి. ఎటులో మృత్యువును మఱిపించి వాఁడు పెద్దవాఁ డైనచో వానికి సత్తువ గలుగు నని మే మాసపడుచుంటిమి. సంతానము లేని లోపమును దీర్చుటకె దైవము వీనిని మాకుఁ బ్రసాదించె నని తలంప సాగితిమి. వీఁడు పెద్దవాఁడై, విద్యాబుద్ధులు నేరిచి, పిల్లలతండ్రియై, కనినవారికిని బెంచినవారికిని గొమరుఁడై వారి వంశములు తరింప చేయు ననుకొంటిని ! కాని, వీని బాల్యమరణముచే నాయాశలన్నియు నీటఁ గలసిపోయెను ! నా మనస్సు శోకదందహ్యమాన మయ్యెను. జీవితము దు:ఖభాజన మయ్యెను !

'అబ్బావు' మృతినొందిన పెక్కేండ్లవఱకును, నేను వానిని దలంచుకొని దు:ఖింపని దినము లేకుండెను. నా మనస్సు పిల్లవాని వైపునకు సదా గడియారమువలె ములుసూపుచుండెను. పగలు వ్యర్థమైపోయిన యాశలు, రాత్రులు స్వప్న రూపము దాల్చి నా మనస్సును జీకాకుపఱుచుచుండెను. పసివాని ముద్దుపల్కులు నా