పుట:2015.373190.Athma-Charitramu.pdf/545

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14. "చన్నపురి చక్షువులకు బంగాళాపద్ధతులు" 503

ములు బహిరంగప్రసంగములును వెలువరింపని యేజాతిరహస్య లక్షణములుగాని ప్రకటనములవలన బహిర్గత మగుచుండును ! బంగాళావారి ప్రకటనలకుఁగొన్ని మచ్చులిచ్చెదను: కలకత్తా వీధులలో నడచిపోయెడి నీకన్నుల కొకసందులో, "రాధా పుస్తకాగారము", "వినయ విద్యాసంస్థ" అనుగది ముందలి బల్లలమీఁది యక్షరములు గోచరమగును. ఈ పుస్తకాలయ రహస్య యేమియో తెలియునా? అది వట్టి పుస్తకముల యంగడియె ! ఆ విద్యాసంస్థ యొకచిన్నపాఠశాలయె! ఇంక వివాహప్రకటనములు విశేషముగ నుండును. పంజాబుదేశీయునిగాని, బీహారు వానినిఁగాని పరిణయ మగుటకు బంగాళావనిత యోర్తు కావలయును. ఆమె కులగోత్రములతోడి ప్రసక్తియె లేదు. ఒక వర్తకసంఘమువారి సరకుల విక్రయమును బ్రోత్సహింప నొక యాంగ్ల సుందరి కావలయును ! ఇంకొక యంగడికి జవ్వనియు లావణ్యవతియు నగు స్త్రీ యుద్యోగి కావలయును ! సరకుల నాణెమును జూచికాదు కాతాదారులు వచ్చుట, సుందరుల నాణెమును వదనబింబముల నవలోకించుటకె !

25 అక్టోబరున వ్రాసిన వ్యాసమున "బంగాళా బాబూ"లను గుఱించి ప్రసంగించితిని. దాక్షిణాత్యులకు, "బాబూ" అను పదమునకుఁ గల యర్థము పూర్థిగ గ్రాహ్యము గాదు. అఱవ వారిలో 'అయ్యరు' 'అయ్యంగారి'వలెను, తెలుఁగువారిలో 'పంతులు' 'శాస్త్రులు' వలెను, 'బాబూ' అనునది గౌరవవాచకపదము. కాని, యిట్టి మన ద్రావిడపదముల కేదో యొక జాతిమతములు గల పురుషుఁ డని యర్థము. 'బాబూ' అనునది యట్లుగాక, బంగాళీయుల కందఱికి ననువర్తించు గౌరవపదము 'గారు', 'అవర్గలు' అనునవి పదాంతములందుండు గౌరవార్థసూచకమగు వర్ణ ములె గాని, 'బాబూ' వలె ప్రత్యేకపదములు గావు. ఇంక, వేషములో,