పుట:2015.373190.Athma-Charitramu.pdf/544

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 502

లోనిది. అది నేను కలకత్తాచేరిన కొలఁదిదినములకే వ్రాసితిని. చెన్న రాజధానిలో సామాన్యముగ నే బహిరంగసభ జరిగినను, ఆంగ్ల భాషలోనే చర్యయు ప్రసంగములు జరుగుననియు, బంగాళములో నట్లు గాక బంగాళాభాషలోనే కార్యక్రమమంతయు నడచుననియును, నేను వ్రాసితిని. అన్యదేశీయుఁడవగు నీవు బంగాళములో నేసభకైనఁ జనినచో, గంటలకొలఁది నీ కొక ముక్కయైనను దెలియని బంగాళభాషలోనే యుపన్యాసములు జరుగుచుండుటఁ గాంతువు. నీ వెఱిఁగిన యింగ్లీ షుమాట లేమైన వినవచ్చు నేమో యని నీ వాసక్తితో నాలకింతువుగాని, ప్రసంగములన్నియు శుద్ధ దేశభాషలోనే సాగిపోవును ! మనతెలుఁగు దేశమునవలె నింగ్లీషుపదములు వారి మాతృభాషాప్రసంగముల మధ్యనుండి దొరలుచుండవు. ఇంక విద్యార్థులు విద్యాధికులును, తమయింట మాటాడుకొనునపుడు దేశభాషనే వాడుదురు. ఉత్తర ప్రత్యుత్తరములన్నియు బంగాళాభాషలోనే నడచుచుండును. ఒక వేళ వారొక యాంగ్లపదమే యుపయోగింపవలసి వచ్చినచో, దాని కెంతో నేర్పుతో బంగాళీప్రత్యయముచేర్చి, తాము సృష్టించిన నూతన పదమును వాడెదరు. అచట నాంగ్ల విద్యనేర్చిన విద్యాధికులు, గంటల కొలఁది తమ యుపన్యాసములందు సామాన్యముగ సంకరమేమియు లేని బంగాళీపదములె ప్రయోగించి, తమ భాషాభిమానమును నిలువఁ బెట్టుకొనుచున్నారు. కావుననే హిందూదేశభాషలలో నెల్ల బంగాళీ భాషలోనే మంచి నవీన సాహిత్యగ్రంథములు గానవచ్చుచున్నవి.

1913 శెప్టెంబరు 26 వ తేదీ పత్రికలో నేను "ప్రకటన"లను గుఱించి వ్రాసితిని. ఏ జాతియొక్క స్వభావమైనను, పెద్ద సంగతులలోనెగాక చిన్న వానియందును ప్రకటీకృతమగుచుండును. నాగరక ప్రపంచమునకు ప్రకటనము ప్రాణసదృశము. పత్రికలు పుస్తక