పుట:2015.373190.Athma-Charitramu.pdf/541

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

13. కలకత్తా ప్రయాణము 499

మిగుల కష్టసాధ్యమయ్యెను. నెమ్మదిపడినపిమ్మటకూడ వాఁడతి నీరస స్థితిలోనుండెను. ఇంతలో మేము పెంచెడి యర్భకునికిని జబ్బు చేసెను. వానికిఁ గొంత నెమ్మది కలగుఁగనే మేము కలకత్తా ప్రయాణమైతిమి.

ఆ జూలయినెల జరిగినపిమ్మట పిల్ల వానికి కలకత్తాలోఁ జాల జబ్బుచేసెను. కొన్నిదినములవఱకు వానిప్రాణములమీఁది యాస వదలుకొంటిమి. కాని, యొకకవిరాజుయొక్కయు నాకు మిత్రులైన డాక్టరుప్రాణ కృష్ణాచార్యులవారియు సాయమువలన, వాని, కారోగ్యము కలిగెను.

ఆ సంవత్సరము దుర్గపూజ సెలవులలో మేము మువ్వురము కాశి, గయ, ప్రయాగ క్షేత్రములు సందర్శించి వచ్చితిమి. గయలో కర్మకాండ ముగించి, బుద్ధగయ చూచితిమి. బుద్ధభగవానుఁడు తపస్సు చేసికొనిన మఱ్ఱిచెట్టునీడనె యానాఁడు నాచదువును, మాపిల్లవాని సాపాటును జరిగెను. బౌద్ధదేవాలయము హిందూధర్మకర్తల పరిపాలన మందుండుటయు, దేవళముచుట్టును హిందూవిగ్రహాదులు వెలయుటయు నా కమితాశ్చర్యమును గొలిపెను. అచ్చటినుండి మేము కాశివెళ్లి యొక వారము నిలిచితిమి. ఒక మణికర్ణికాఘట్టమునొద్ద స్నానముతోనే నేను సంతృప్తుఁడనైతిని. పుణ్య క్షేత్ర సందర్శనమునకంటె నాకు పరీక్షావిజయమె మోక్షదాయకముగఁ దోఁచెను ! కలకత్తాలోకంటె కాశిలో నా కెక్కువగ దక్షిణదేశపుఁ బోలికలు గాన వచ్చెను. ఇచట దాక్షిణాత్యు లనేకులు గలరు. ఒకనాఁడు మేము వ్యాసకాశి పోయి, రాజుగారిభవనమును జూచివచ్చితిమి. దీనికేమి గాని, కాశిలో కోఁతులబాధ యమితముగఁ గానవచ్చెను. అచట నరులమీఁద వానరులె యధికారము చెల్లించున ట్లగపడెను. ఒక