పుట:2015.373190.Athma-Charitramu.pdf/540

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 498

కుగ్రామమున భార్యయుఁ, బసివాఁడును నెటు లుండిరో యని సదా డెందమున నలజడిగ నుండెడిది. కాని, పరిచితులు మిత్రులు నగు నాంధ్రులు నన్నుఁ బరివేష్టించియుండుటచేత, నేనెటులో యామూఁడు నెలలును పరదేశమునఁ గడపి, దుర్గపూజ సెలవులకు గోదావరిజిల్లా వెడలివచ్చితిని.

ఆ దసరాసెలవులలో పామఱ్ఱులో నివసించి, అక్టోబరునెలలో భార్యను, పిల్ల వానిని దీసికొని కొంత సామగ్రితో నేను కలకత్తా పోయిచేరితిని. బంగారయ్యయు సకుటుంబముగ నిపుడు కలకత్తా వచ్చుటచేత, మే మిరువురమును ముక్తారామబాబువీథిలో నొక చిన్న యింట బసచేసితిమి. ఈమాఱు నామనస్సునకుఁ గొంత నెమ్మది గలిగెను. వైద్యులకుఁ బిల్లవానినిఁ జూపించి, వారిచే మందు లిప్పించితిని. మాతమ్ముఁడు వెంకటరామయ్య మమ్ముఁ జూచిపోవుటకు 1914 వ సంవత్సరారంభమున కలకత్తావచ్చి, ఆవేసవిని భీమవరమునకు మమ్మాహ్వానించెను.

1914 వేసవి మేము భీమవరమునఁ గడిపితిమి. మాతమ్ముఁడపు డారంభించిన నూతన గృహనిర్మాణమున నేనాతనికి సాయము చేసితిని. ఒకచేతఁ బుస్తకమును, ఒకచేతఁ బిల్లవానిని దీసికొని, కనులు పనివారలమీఁద నుంచి, నే నా సెలవుదినములు గడపితిని. సెలవులు ముగియునప్పటి కిల్లు దాదాపుగఁ బూర్తియయ్యెను కాని, తుది దినములలో మాకుఁ గొంత మనశ్శాంతి తొలఁగిపోయెను. వెంకటరామయ్య మూఁడవకుమారుఁడు సూర్యనారాయణ కపుడు ఐదారేండ్ల వయస్సు. వాఁడు బాల్యచాపల్యమున నెండలో నల్లరిగఁ దిరుగుచు, కనఁబడినకాయకసరులు నమలుచుండుటచేత, వాంతులు విరేచనములును వాని నమితముగ బాధించెను. వానివ్యాధినివారణము