పుట:2015.373190.Athma-Charitramu.pdf/532

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 490

మేము దు:ఖసాగరమున మునిఁగిపోయితిమి. కొన్ని సంవత్సరములనుండి దు:ఖమును మఱచియుండిన మాకు మరల కష్టదశ సంప్రాప్తమయ్యెను. మాయందఱిలోను మిగుల చిన్నదియు, మితభాషిణియు, వినయాది సుగుణభూషితయు నగు మా చెల్లెలి కీ యకాల మరణము సంప్రాప్తమగునని కలనైన ననుకొనలేదు. ఇపుడు జనించిన పిల్లవాఁడుకాక యామెకు విశ్వనాధమను నింకొక కుమారుఁడుగలఁడు. మాతంతి నందుకొని గుంటూరువచ్చిన కామేశ్వరమ్మభర్త దహనాది కర్మలు జరిపి, పెద్దపిల్ల వానినిఁ దనవెంటఁ దీసికొని, స్వగ్రామము వెడలిపోయెను. ఒకమూల మావెల్లెలి చావునకు విలపించుచుండు మేము, ఆమె విడిచిపోయిన యర్భకునిఁ బెంచవలసివచ్చెను. పిల్లవాని ప్రాణమునుగుఱించి యాశ యంతగలేక, పుట్టిన పదిదినములవఱకును వానిని వైద్యాలయముననే యుంచి, పిమ్మట మాయింటికిఁ గొనివచ్చితిమి.

వైద్యశాలలో నున్నదినములలో పలుమాఱు శిశువు సొమ్మసిల్లుచువచ్చెను. మాయింటికిఁ గొనివచ్చినప్పుడు వాఁడు ప్రాణము లనట్టుగనుండెను. వానినిఁ బోషించుభారము మామీఁదనే పడెను. వలసినప్పుడు చనుబాలు వానికి దొరకుట దుస్తరమున నుండెను. పగలు రాత్రులును దాదులను బెట్టి, శిశువునకుఁ బా లిప్పించుచువచ్చితిమి.

పిల్ల వాని పోషణమును గుఱించి రాత్రులు సరిగా నిద్రలేక పోవుటచే నాభార్యకు 'కామిలా' వ్యాధి సోఁకెను. ఆమె యందు వలన కొన్నిదినములు కుగ్లరువైద్యాలయములో నుండవలసివచ్చెను. ఆరోజులలోనే పసివానికిని జబ్బుచేయుటవలన వానినిఁగూడ నా వైద్యశాలకే చేర్చితిమి. అంత స్వాస్థ్యముగలిగి, ఫిబ్రవరి 15 వ తేదీని వారిరువురు నిలుసేరిరి. ఇంతవఱకును మాకు సాయముచేసిన పెద్ద