పుట:2015.373190.Athma-Charitramu.pdf/529

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12. చెల్లెలి మరణము 487

న్యాసకులుగను, అధ్యక్షకులుగను నుండిరి. విద్యాశాఖ డైరెక్టరు స్టోను దొరగారు ప్రదర్శనము నారంభించిరి. సుబ్బారాయఁడుశాస్త్రిగారు స్వాగతోపన్యాస మిచ్చిరి. "పాఠశాలలోని పని-తలిదండ్రుల" ను గూర్చి నేనొక యాంధ్రవ్యాసమును రచించి చదివితిని.

12. చెల్లెలి మరణము

1911 వ సంవత్సరమున కళాశాలలో విద్యాబోధనమునకంటె నితర వ్యాసంగములే నా కెక్కువ భారమయ్యెను. విద్యావిషయక సభలనుగుఱించి యిదివఱకె ప్రస్తావించితిని. ఆ జనవరిలో సభలు ప్రదర్శనములు జరిగెనేగాని, ప్రదర్శనమునకు సంబంధించిన పను లెన్నియో మిగిలియుండెను. ఆ సంవత్సరపు "ఆంధ్ర పత్రిక : ఉగాదిసంచిక"లో "ఉత్తమబోధక లక్షణము" లను గూర్చి నే నొక వ్యాసమును వ్రాసితిని. ఈశ్వరముఖముఁ జూచియు పారమార్థిక చింతతోడను, ఉపాధ్యాయ ధర్మనిర్వహణమునకుఁ గడంగిన బోధకుఁడె బోధకుఁ డనియు, అట్టి గురుముఖమున శిష్యునికి లభించిన విద్యయే విద్యయనియును, గురువు విద్యాపారంగతుఁడు గావలెననియు, విద్యాబోధనమువలని ముఖ్యప్రయోజనము విద్యార్థికి జ్ఞానమునకంటె నయసంపద సమకూర్చుటయే యనియు, మంచి యుపాధ్యాయుఁడు మానుషస్వభావమును గ్రహించి శిష్యుని మన:కుసుమమునకు వికసనము గలిగించి, శ్రీకృష్ణుఁడు అర్జునుని పట్ల మెలంగినట్లు మెలంగుననియును నేను వ్రాసితిని.

ఆ సంవత్సరము 16 ఏప్రిలున, నరసాపురమున జరిగిన "కృష్ణా గుంటూరుమండల సంఘసంస్కరణసభ"కు నానగ్రాసనాధిపతిగఁ గోరు