పుట:2015.373190.Athma-Charitramu.pdf/517

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

9. నూతనపరిస్థితులు 473

రింపరా దని నా కంతఁ దోఁచెను. ఒక పర్యాయము విరమించిన పత్రికను మరల జరుపుట అశుభసూచకముగఁ గానఁబడెను ! వీని యన్నిటి పర్యవసానము, మరల నే నే పత్రికను నెలకొల్ప కుండుటయే ! పత్రికాస్థాపనమును గూర్చి తగినంత నిశ్చయోత్సాహము లుండె నేని, తీఱిక లేకుండుట, మంచిపేరు దొరకకుండుట మున్నగు సాకు లెవ్వియు నడ్డుపడెడివి కావు.

నాచేత ప్రత్యేకపత్రిక యొకటి లేకున్నను, ఇతర పత్రికలకు వ్రాయుచునే వచ్చితిని. "మద్రాసు స్టాండర్డు" "సంఘసంస్కారిణీ" పత్రికలకు నే నపుడపుడు వ్రాయుచుండువాఁడను. ఆంధ్ర పత్రిక సంవత్సరాదిసంచికకు వ్యాసమేదియైన వ్రాయుఁడని, పూర్వము 'జనానాపత్రిక' ను జదువుచుండెడి శ్రీ కాశినాధుని నాగేశ్వరరావు పంతులుగారియొద్ద నుండి వచ్చినపిలుపు నాదరించు చుండువాఁడను. ఇట్లు నేను వ్రాఁత బొత్తిగ మఱచిపోకుండ నేదో యొకటి గోఁకుచు వచ్చితిని గాని, ఈకాలమున మొత్తముమీఁద నాకలము త్రుప్పుపట్టి యుండె ననియే చెప్పవలెను.

గుంటూరు వచ్చిన మొదటిదినములలో నావ్రాఁత యిట్లు తగ్గి పోయినను, తక్కిన కర్మకాండకేమియు వ్యాఘాతము గలుగలేదు. ప్రార్థనసమాజప్రచారము సంగతి యిదివఱకే ప్రస్తావించితిని. 'మంగల వానిని జూచి యెద్దుకంటె' ననునట్టుగ, గత సంవత్సరముననే నుండు విజయనగరమున "విద్యార్థి సమావేశము" జరిగెను గాన, ఈసారి నేనుండు గుంటూరునం దద్దానిద్వితీయ సమావేశము జరుప నిచటి విద్యార్థులు సంకల్పించుకొనిరి ! ఈసభను జరుపుటకై, గుంటూరు కళాశాల పురవిద్యాలయములం దుండు విద్యార్థు లొక సమాజముగ నేర్పడి, తమలోఁ గొందఱిని, పట్టణప్రముఖులలోఁ గొందఱిని, "ఆహ్వాన