పుట:2015.373190.Athma-Charitramu.pdf/502

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 460

యాశ్చర్యమున విని, ఆ పుస్తకములు తానును జదివి, వానిలోని ఆ ముఖ్యాంశములు కోటలోని రాణి సర్కారువారి కెఱిఁగించుచుండువాఁడు. సచ్ఛీలతా సుహృదయతల కామహాశయుఁ డీపట్టణమున నాదర్శప్రాయుఁ డగుటచేత, ఆయనతోడ సహవాస సంభాషణములు నా కిపు డానందసంధాయకము లయ్యెను.

నావలెనే సహాయోపన్యాసకులగు సీమనపల్లి రామయ్యగారికి నాకును వేగమే మనసు గలిసెను. ఆయన సరసుఁడు. హాస్యరసయుక్తములగుమాటలు చెప్పుటయందు మిగుల నేర్పరి. ప్రజలను గుఱించియు, పుస్తకములను గుఱించియు సారస్యములగు వ్యాఖ్యలు చేసి, సావాసులను సౌఖ్యాబ్ధి నోలలాడింపఁ గల సామర్థ్యము గలవాఁడు. కాని, తన కటువాక్యప్రయోగ మితరుల మనస్సులకు నొప్పి గలిగించె నని యాయన బాగుగ గుర్తెఱుఁగ కుండెను. వాక్సంబంధ మగు నజాగ్రత్తవలననే జనులలోఁ గొందఱితో నాయనకు వైరభావ మేర్పడెను.

కళాశాలలోని ముఖ్యోపన్యాసకు లగు వంగ మాధవరావు నాయఁడు, వి. వెంకటరాయశాస్త్రి, ఏచూరి నరసింహము పంతులు గార్లును నాకు శీఘ్రమెపరిచితులైరి. వీరిలో వెంకటరాయశాస్త్రి గారికిని నాకును సంబంధ మధికము. ఆయన తర్క మనశ్శాస్త్రము లందు ముఖ్యోపన్యాసకులు. తర్కమున నే నాయనకు సహాయకుఁడను. పాఠవిషయములను గుఱించియేగాక, నాకుఁ బ్రియములగు తత్త్వశాస్త్రవిషయములను గుఱించియు పలుమాఱు మేము సంభాషించు చుండువారము. ఆయన సాధుపురుషుఁడు; మిత భాషి; వెనుకటి యధ్యక్షులగు చంద్రశేఖరశాస్త్రిగారికి దగ్గఱ బంధువు. కళాశాలలోని యున్నతపాఠశాలకు ప్రథానోపాధ్యాయుఁ డగు పిడపర్తి సూర్యనారాయణ శాస్త్రిగారు నేనును కొంతకాలము కొత్తపేటలోఁ