పుట:2015.373190.Athma-Charitramu.pdf/501

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6. విజయనగర నివాసము 459

అంతకంతకు నాకు మశకగానము సింహగర్జన మయ్యెను. ఈబాధవలన నొక్కొకప్పుడు నాకు రాత్రి పగలును, పగలు రాత్రియును నగుచు వచ్చెను.

ఈ దోమల సంపర్కముననే యీపుర మింతరోఁత గొలిపెడి రోగముల కావాసమయ్యె నని వైద్యు లనుచువచ్చిరి. కుష్ఠము, బూరకాలు, బృహద్బీజము మున్నగు వ్యాధులచేఁ బీడితులగు ననేకులు నిత్యము నా కనులఁ బడుచుండిరి. ఈ వ్యాధులనుండి తప్పించుకొనుటకు దోమకాటు పడకుండుటయు, మంచినీరు త్రావుటయు ముఖ్య సాధనము లని వైద్యులు చెప్పుచుండిరి. ఆ కాలమున విజయనగరమునకు నీటివసతి లేదు. అచట మంచినీటికి చెఱువులే యాధారము. కాని, యాచెఱువునీరు అపరిశుద్ధముగ నుండెడిది. మంచినీళ్ల బావులు మిక్కిలి కొంచెమె. అవి పట్టణమున కతిదూరమున నుండెడివి. అందువలన విజయనగరనివాసము మాకు దుస్సహ మయ్యెను.

కళాశాలలో నాకు స్నేహితు లేర్పడిరి. అధ్యక్షులగు రామానుజాచార్యులుగారు నాయెడ సదభిప్రాయు లై యుండిరి. కళాశాలలో నేను ప్రథమసహాయోపన్యాసకుఁడ నగుటచేత, కాలనిర్ణ యపట్టికలు వేయుపనియు, విద్యార్థుల యాటల యేర్పాటుచేయు పనియు నేను జూడవలసి వచ్చెను. అధ్యక్షులు, నేనును కళాశాల తరగతులకు ఆంగ్ల భాషాధ్యాపకులము. కావునఁ దఱచుగ నే నాయనను గలసికొని మాటాడు చుండువాఁడను. ఆయనయు నూతన గ్రంథపఠనమునం దమితాసక్తి గలవారు. పుస్తకాగారమునకుఁ గ్రొత్త పుస్తకములను దెప్పించు విషయమున నేను జేసిన సూచన లాయన యంగీకరించువాఁడు. 'మనశ్శక్తి పరిశోధనాసమాజ' ప్రచురణములందు నేను జదివిన వినోదాంశము లాయనకుఁ జెప్పఁగా, యన