పుట:2015.373190.Athma-Charitramu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము

డవ మేనమామయగు వెంకయ్యగారిమీఁదఁ గోపించునపు డెల్ల నేనును భీతిల్లుచుండినను, నన్నాయన గారాబముతోఁ జూచుచుండువాఁడు. మా తల్లితోఁ గలసి వెళ్లి రాజమంద్రిలో వారియింటనే నుండినరోజులలో, నన్నాయన పెద్దబజారున నుండు తన కొట్టునొద్దకుఁ గొనిపోయి, తనకు నాచేత మా తల్లి వ్రాయించిన యుత్తరములు పొరుగు వారలకుఁ జూపించి, నా విద్యాకౌశలమును వారికి వర్ణించి చెప్పుచు, ఎఱ్ఱనిపంచెలు చిలుకల రుమాళ్లును నాకుఁ గొనిపెట్టుచుండువాఁడు. సాయంకాల మాయన యింటికి వచ్చునపుడు పిల్లలమగు మాకు మిఠాయిపొట్లములు తెచ్చి యిచ్చుచుండును. శ్యామలదేహవర్ణముతోను, చంచలవిశాలనేత్రములతోను నొప్పుచుండి, ఆయన మా జననిని మిక్కిలి పోలియుండెను. ఆయన యకాలమరణము మమ్మందఱిని దు:ఖార్ణవమున ముంచివేసెను.

కొన్నిదినములు రాజమంద్రిలో నుండి పిమ్మట గోపాలపురము వెడలిపోయినమేము, ఐదాఱునెలలలోనే మరల నచ్చటికి రావలసి వచ్చెను. పుత్రశోకార్తుఁడైన మా మాతామహుఁడు మనోవ్యధచే శీఘ్రకాలములోనే మంచ మెక్కెను. మేము వచ్చినపుడు, ఆ వృద్ధుఁడు మాట పడిపోయి యుండినను, మా మాటలు వినునపుడు ఆయనకు స్పృహవచ్చెను. చిన్నపిల్లలమగు మమ్మును గౌఁగలించుకొని, కన్నుల నీరు విడిచెను. తన పేరిఁటివాఁడును, ప్రియపౌత్రుఁడును నగు మా తమ్ముఁడు వెంకటరామయ్య నాయన అక్కున నదిమినపుడు, దు:ఖోద్రేకమున నపుడే యాయనప్రాణము లెగిరిపోవు నని యందఱు భీతిల్లిరి. ఒకటిరెండుదినములలో మా తాత కాలగతి నొందఁగా, ఇంట నందఱును దు:ఖవిహ్వలులైరి.