పుట:2015.373190.Athma-Charitramu.pdf/480

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 440

"ప్రేమాస్పదులగు వీరేశలింగము పంతులుగారి చరిత్రము మీరు శీఘ్రముగఁ బ్రచురించెద రని విని సంతసించితిని. * * ఈవిషయమున మీకుఁ గావలసిన సాయము సంతోషపూర్వకముగఁ జేయుదును. * * *

ర. వెంకటరత్నము."

నేను మద్రాసు స్టాండర్డుపత్రికకు పలుమాఱు వ్రాయుచుంటిని. స్థానికవార్తలు వ్రాయ నాయభ్యాసముకాదు. "గంజాము, విశాఘపట్టణమండలముల వింతలు" అను శీర్షికతో నప్పుడప్పుడు నేను వ్రాయు సంగతులు మిత్రులు శ్రీ గిడుగురామమూర్తిపంతులుగారు వినోదమునఁ జదివి నన్నభినందించు చుండువారు. గంజాము మండలము వారికి మనుష్యులయందు కంటె దున్న పోతులను బెంచుటయం దెక్కువ శ్రద్ధయనియు, చిన్న వెండిబేడకాసు లాప్రాంతమునఁ జెల్లవనియు, కాళ్లు పట్టించుకొనుట వారి కభ్యాసమనియు, ఓడ్రులు రాత్రులం దొడలికి నూనిరాచి పసుపుఁబూసికొని వేకువనే చెఱువులో స్నానము చేయుదురనియు పత్రికకు వ్రాయుచుండు వాఁడను.

ఇచటి హీనజాతులలోనివారు కొందఱు పాటుపడుటమాని, వీథులలోని యెంగిలాకులు నాకుచు కాలక్షేపముఁజేయుట నాకు విషాదము గలిగించెను. 20 వ జూలయి ఆదివారము ప్రార్థన సమాజ సమావేశమున నేను "సోమరితనము"ను గుఱించి ధర్మప్రసంగము చేయుచు, ఇట్టి సోమరుల నీచకృత్యములను గర్హించితిని. ఓడ్రసమాజములలోఁగూడ మాటాడుటకు నా కాహ్వానము వచ్చెడిది. సాంఘిక సమస్యలనుగూర్చి సంభాషించుట నా కెంతో ముచ్చట. ఆపట్టణమందలి బహిరంగ సభలు సామాన్యముగ మాకళాశాలా భవనముననే జరుగుచుండెడివి. ప్రసంగింపు మనియో, అధ్యక్షతవహింపు మనియో