పుట:2015.373190.Athma-Charitramu.pdf/478

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 438

నేను పర్లాకిమిడి వచ్చినప్పటినుండియు, 'జనానాపత్రిక' కు నేనును, మాతమ్ముఁడు వెంకటరామయ్యయును సంపాదకులముగ నుంటిమి. అదివఱలో 'సత్యసంవర్థని'కి పత్రికాధిపతిగ నుండిన హేతువున, ఆతఁడు మంచివ్యాసములు వ్రాయుచు, ఈపత్రికను రాజమంద్రిలో నడపుచువచ్చెను. ఆ సంవత్సరము మేయినెల సంచిక మొదట ప్రచురించిన "జానకమ్మ" కథ ఆతఁడు వ్రాసినదియే. 20 వ జూను తేదీని నేను, భార్యయును పర్లాకిమిడికి బయలుదేఱితిమి. మార్గమధ్యమున సింహాచలమున మఱునాఁడు ప్రొద్దున దిగి, ఆలయము చూచి, పిమ్మట పర్లాకిమిడి వెడలిపోయితిమి. ఈమాఱు రాజవీధిలో కళాశాలకు సమీపముననుండు మేడ భాగమున మేము ప్రవేశించితిమి. ఈక్రొత్తయిల్లు మాకన్నిరీతుల ననుకూలముగ నుండెను. కళాశాలకుఁ జేరువ నీ విశాలమగు గృహమున నివసించుటచేత మా కెంతో హాయిగనుండెను.

ఎట్లో శ్రమపడి పొదుపుగ గడుపుకొని, శీఘ్రమే ఋణ విముక్తుల మగుటకు దంపతులము గట్టిపట్టుపట్టితిమి. పర్లాకిమిడిలో ధాన్యము, కాయగూరలు, కట్టెపుల్లలు మున్నగునవి మిగుల చౌక. కావున వెనుకటి కంటె నిపుడు నాచేత సొమ్ము మిగులుచుండెను.

నే నిపుడును, 'జనానాపత్రిక' తోఁబాటు నితరపత్రికలకును వ్యాసములు వ్రాయుచువచ్చితిని. ఈ ఫిబ్రవరిలో చనిపోయిన మన్నవ బుచ్చయ్యపంతులుగారిని గుఱించి మార్చి జనానా పత్రికలోఁ గొంత ప్రస్తావించి, "సంఘసంస్కారిణీ" పత్రికకొక యాంగ్లవ్యాసము వ్రాసితిని. అది గాటుగనుండెను. దానినిగుఱించియు, చనిపోయిన మాతమ్మునిగూర్చియు ప్రస్తావించుచు మిత్రుఁడు వెంకటరత్నము