పుట:2015.373190.Athma-Charitramu.pdf/476

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 436

నేను కళాశాల ప్రవేశించిన క్రొత్తఱికమున నొకనాఁడు ప్రథమశాస్త్ర పరీక్షతరగతిలో నొక పిల్లవాఁడు దుమదుమలాడు మొగమునఁ గూర్చుండుట చూచి, కారణమేమని నేనడిగితిని. కోపోద్రేకమున నాతఁడు ప్రత్యుత్తర మీయఁబోఁగా, కోపము విద్యార్థుల కనర్థదాయకమని నేనంటిని. ఆతని వైఖరి నాకు బాగుగఁ గానఁబడ లేదు. తనను గొప్పవానిగ భావించి గురువు గౌరవింప వలెనని యాతని కోరిక యని వానిమాటలవలనఁ దేలెను. తానెంత తెలివిగలవాఁడైనను, గురు వాతనిని శిష్యునిగనే పరిగణించునని నేను జెప్పివేసితిని. పిమ్మటాతఁడు నాయొద్దకువచ్చి, తనతప్పు సైరింపుఁడని వేఁడెను. తరగతిలోఁ జేసిన నేరమునకు తరగతిలోనే తాను క్షమాపణ వేఁడినచో నేను క్షమింతునని చెప్పివేసితిని. దీనికాతఁడు సమ్మతింప లేదు. కావున నేనీసంగతి కళాశాలాధ్యక్షునికి నివేదింపఁగా, విద్యాలయమునకు రెండుదినము లాతఁడు రాకుండునట్టుగ వానికి శిక్షవేసిరి. పిమ్మట నెపుడును విద్యార్థులతో నాకు సంఘర్షణము గలుగ లేదు.

21 వ మార్చిని నా భార్య పర్లాకిమిడి వచ్చునని తెలిసి, నేను నౌపడావెళ్లి కనిపెట్టుకొని యుంటిని. ఆరాత్రి మెయిలుమీఁద తమ్ముఁడు కృష్ణయ్య వదెనను గొనివచ్చెను. మఱునాఁడు మువ్వురమును రెయిలుమీఁద పర్లాకిమిడి వచ్చితిమి. వెంకయ్యగారియింట నొక భాగమున మేము కొన్నిదినములు గడిపి, రాజవీథిలో నుండు వేఱొక పూరియింటిలోనికి వెడలిపోయితిమి.

ఈ క్రొత్తప్రదేశమునకు వచ్చినదిమొదలు నా చిరకాలాభ్యాసములలోఁ గొన్నిటియందు మార్పు గలిగెను. వీనిలో ముఖ్యమైనది దినచర్య పుస్తకములను గుఱించినది. కళాశాల తరగతులలోని బోధనకై యధికముగఁ బరిశ్రమించుటచేత నాదినచర్యను పుస్తకములందు