పుట:2015.373190.Athma-Charitramu.pdf/467

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

51. నూతనోద్యోగము 427

మందు పుచ్చుకొనుటకై సతి నచట నుంచి, నేను రాజమంద్రి వెడలిపోయితిని.

నేను రాజమంద్రి చేరునప్పటికి నాకొక యుత్తర మచటికి వచ్చియుండెను ! నా పూర్వమిత్రుఁడును పర్లాకిమిడి కళాశాలలో నుపాధ్యాయుఁడును నగు శ్రీ జంధ్యాల సుందరరానయ్యగా రది వ్రాసిరి. నాకు పర్లాకిమిడియుద్యోగ మిచ్చిన టెయిలరుదొర మరణావస్థలో నుండె ననియు, ఆతఁడు చనిపోయినచో కళాశాల దుస్థితికి రావచ్చు ననియును, నామిత్రుఁడు తెలిపెను ! నే నెచటికి, బోఁదలచినను, దురదృష్టదేవత ముందడుగు వేయుచుండునట్లు కానఁబడెను.

నే నిపు డిచ్చినతంతి నందుకొని, తనయుత్తరము నాకుఁ జేరు వఱకు నిచటనే నిలిచియుండుఁ డనియు, తాను బయలుదేఱుచున్నాననియును, సుందరరామయ్యగారు రాజమంద్రికి మాఱుతంతినిచ్చిరి. కావున నింకను నాసందిగ్ధావస్థ తొలఁగనేలేదు ! ఆయన వ్రాసిన యుత్తరము నా కాలస్యముగఁ జేరెను. అందులో, టెయిలరుదొర చనిపోయె ననియు, నేను బాగుగ నాలోచించి మఱిరావలె ననియును మాత్రమే యుండెను ! ఇదివఱకు దొరతనమువారిపని పోయి, యిపుడు పర్లాకిమిడియుద్యోగఁపు సంగతి యిట్లు కాఁగా, ఎప్పటి బెజవాడయుద్యోగమే నాకు తుదకు గతి యగునట్లు తోఁచెను! కాని, వదలివేసిన పనికొఱ కాశించుట యగౌరవ మని మాకుఁ గానఁబడెను. దైవముమీఁద భారము వేసి, ముందుచూపు చూచి, పర్లాకిమిడికిఁ జనుటకే నేను నిర్థారణచేసికొంటిని. పర్లాకిమిడి మన్య ప్రదేశమనుట యసత్య మని యాప్రాంతములందు పనిచేసి వచ్చిన మిత్రుఁడు నరసింహరాయఁడుగారు నొక్కి చెప్పిరి. కావున నేను మాతమ్ముఁడు