పుట:2015.373190.Athma-Charitramu.pdf/457

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

48. తమ్ముని వ్యాధి 419

మయ్యును, నాసంగతి యాకళాశాలాధికారి తలపెట్టినందుకే నేను సంతోషించితిని ! కొలఁదినెలలలో నా కిచటనే 90 రూపాయిల జీత మిచ్చెదరు గాన, నాకుఁ దగినవేతన మొసఁగినచో, పర్లాకిమిడి వచ్చెదనని నేను మఱునాఁడే యాయుద్యోగీయునికి ప్రత్యుత్తరము వ్రాసితిని.

నే నిదివఱకే భీష్మునిగుఱించి యాంగ్లవ్యాస మొకటి వ్రాసి ప్రచురించితిని. ఇపుడు కార్లయిలుని "శూరుల" వంటిపుస్తకము నాంగ్లమున రచియింపఁబూని, "ప్రహ్లాదుఁడు - దేవుని ప్రియభక్తుఁడు", "అర్జునుఁడు - సాధకుఁడు" అను శీర్షికలతో నేను గొన్ని వ్యాసములను వ్రాయనెంచితిని.

23 వ నవంబరు దినచర్యలో నిట్లు గలదు : - "గతరాత్రి భార్యయు నేనును పర్లాకిమిడి యుద్యోగము నాకుఁ గావచ్చునని యెంచి, భావవిషయములను గుఱించి తలపోసితిమి. 'ఎపిక్టిటసు'చదివి, యందలి రమ్యములగు కథపట్టు లామెకు బోధపఱిచితిని. * * నేఁడు మరల గృహకల్లోలము ! అనుతాపలేశ మెఱుంగని గర్విణియగు సతితో సంసార మెట్లు పొసంగును ?"

8 వ డుసెంబరున బంగాళావాస్తవ్యులు విపినచంద్రపాలు గారు మద్రాసునుండి వచ్చి నా కతిథులయిరి. వారికిఁ గావలసిన సౌకర్యములు నే నొనఁగూర్ప లేకుంటిని. "కాఫీ" మేము చేయలేక పోయితిమి. కాఫీ చేయ నేరని కుటుంబపు జీవితము వ్యర్థమని వారు చెప్పివేసిరి ! ఆసాయంకాలము వా రొక యుపన్యాస మిచ్చి, మఱునాఁడు వెడలిపోయిరి.

19 వ డిసెంబరునాఁటికి పాఠశాలపనియు, ప్రాథమికపరీక్ష పనియుఁ బూర్తియయ్యెను. తమ్ముఁడు సూర్యనారాయణ జ్వరము