పుట:2015.373190.Athma-Charitramu.pdf/456

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 418

మంద్రి చేరితిని. సూర్యనారాయణకు జ్వరము కొంత తగ్గె నని చెప్పిరి గాని, యింకను తీవ్రముగనే యుండెను. నారాక వలన వాని కెంతో ధైర్యము కలిగెను. తనకు గుంటూరుచెప్పులజోడు తెచ్చి పెట్టుమని వాఁడు ప్రాధేయపడెను. ఒక క్రొత్తపంచెయు గొడుగును నే నీయఁగా, వాఁ డెంతో సంతోషించెను. "అయ్యో నాదారిద్ర్య మెంత దు:ఖభాజనము ! తండ్రికి జీవితకాలమున సౌకర్యము లొనఁ గూర్పనైతిని. ఇపుడు నా తోఁ బుట్టినవానికోరికలు చెల్లింప నేరకున్నాను !" అని నేను లోలోన వగచితిని. త్వరలో నేను మరల వచ్చెద నని తమ్ముని సమాధానపఱిచి, 4 వ నవంబరున నేను బెజవాడ వెడలిపోయితిని. తమ ప్రియశిష్యుఁడు సూర్యనారాయణ జబ్బు పడె నని విని, నా యుపాధ్యాయమిత్రు లందఱు బెజవాడలో ఖిన్నులైరి.

బెజవాడలో 18, 19 నవంబరున చట్టనిర్మాణసభల కెన్నికలు జరిగెను. పురపాలకసంఘముల తరపున కృత్తివెంటి పేర్రాజు పంతులుగారును, స్థానిక సంఘములపక్షమున జంబులింగమొదలియారు గారును నియమింపఁబడిరి. నాతోడి బోధకుఁడు కల్యాణరామయ్యరుగారు మెయిలుపత్రికకును, నేను స్టాండర్డుపత్రికకును ప్రతినిథుల మై సభలలోనికి వెళ్లి, సమాచారములు వ్రాసి పత్రికల కంపితిమి.

నేను జేసిన కృషిఫలితముగ, పర్లాకిమిడి కళాశాలాధికారి యగు టెయిలరు దొరనుండి నాకొక జాబు వచ్చెను. తమ విద్యాశాలలోని క్రిందియుపాధ్యాయులకు క్రమముగ పైయుద్యోగము లిచ్చెద మనియు, అందువలన నాకు డెబ్బదిరూపాయల పనిమాత్ర మీయఁగలమనియు వారు వ్రాసిరి. ఇచటనే 85 రూపాయిలు జీతము గలనాకు 70 రూపాయిలపని యిచ్చెద మనుట నిరుత్సాహకర