పుట:2015.373190.Athma-Charitramu.pdf/444

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 406

ఈ సమయమున మాతమ్ముఁడు సూర్యనారాయణకు వివాహ సంబంధములు కొన్ని వచ్చెను. ఆతనికిఁ గట్నము లిచ్చెద మని పలువురు భ్రమపెట్టునప్పుడు, ఋణబాధతో నుండు మా కాతనిబెండ్లి యెడఁ గొంత సుముఖత్వము గలుగుచువచ్చెను. కాని, మే మావిషయమున నేనిర్ధారణమునకును రాఁజాల కుంటిమి.

"అక్కఱ కల్పనకు జనని" అను నొక లోకోక్తి యాంగ్లమునఁ గలదు. "జనానాపత్రిక" కు నెలనెలయును నేను బెక్కు వ్యాసములు వ్రాయవలసివచ్చెను. ఏదైన పుస్తక మారంభించి వ్రాయుచున్నచో, పత్రికకుఁ దగినంత మేఁత దొరకునని నే నిదివఱకు "హిందూసుందరీమణుల" రెండుభాగములును వ్రాసితినిగఁదా. ఇపుడు కొంతకాలమునుండి "ఇంగ్లీషువారి సంసారపద్ధతులు" కూడ తెలుఁగు చేసి పత్రికలోఁ బ్రచురించుచున్నాఁడను. కాని, యీపుస్తకములు వ్రాయుటలో నాస్వకపోలశక్తి యంతగ వ్యక్త మగుటలేదు. పద్యరూపమున నుండు పురాణకథలు గద్యమున లిఖించుటయందుఁగాని, యాంగ్లేయ పుస్తకము నొకటి యాంధ్రమున కనువదించుటయందుఁ గాని, స్వతంత్రరచనమున కవకాశ మేమిగలదు? సొంతకథ లల్ల నాకిపుడు కుతూహలము పొడమెను. 1901 మార్చినెల 'జనానాపత్రిక'లో "బాలాంబరాణి" యను నొక కథ వ్రాసి ప్రచురించితిని. దీని నాఱుప్రకరణములుగఁ జేసి, ప్రతిప్రకరణమునకు మకుటముగ నొకపద్యము నుల్లేఖించితిని. ఇదియొక విషాదాంతకథ. కొండవీటి రెడ్లనాఁటి కథగా దీని నేఁ జెప్పినను, చరిత్రాంశము లిం దేమియుఁ గానరావు. మఱుసటినెల పత్రికలో నింతె పరిమాణముగల "శారద" యనునొక సంతోషాంతకథను వ్రాసితిని. ఇట్లే తక్కినకథలును వ్రాసి, యీకథాసముదాయమునకు వీరేశలింగముగారి "నీతికథా