పుట:2015.373190.Athma-Charitramu.pdf/442

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 404

జెందెను. * * ఈమానినివలె ప్రశాంతియు నిర్మలప్రేమము నలవఱచుకొనిన సతీమతల్లులు స్వర్గలోకసుఖముల నందుటకు సందియము లేదు !"

ఈ 'జనానాపత్రిక' సంచికయె యింక రెండు మరణములు ప్రస్తావించెను. విక్టోరియా మహారాణిగారు జనవరినెల 22 వ తేదీని స్వర్గస్థు లయిరి. ఆనెలలోనే బొంబాయి ఉన్నతన్యాయస్థానమున న్యాయాధిపతులును దేశప్రముఖులును నగు రానడీగారు కీర్తి శేషులయిరి.

మా పినతల్లియుత్తరక్రియలు రాజమంద్రిలో మాయింటనే జరిగెను. తనచెల్లెలు చనిపోయిన యాఱవనాఁడు మాతల్లికి ప్రబలమగు మూర్ఛలు గానఁబడెను. అందువలనఁ గొన్ని దినములకుఁ గాని యా మెకు శక్తియు స్పృహయు రాకుండెను. కర్మాంతరము లైన పిమ్మట బంధువులు వెడలిపోయిరి. తనభార్యనగల సంగతి తేల్చినచోఁ దాను బోయివచ్చెద నని మాపినతండ్రి మాతో ననినపుడు నా కెంతో కోపము వచ్చినను, పిదప పరితాపము కలిగెను. తన భార్య కొంచెమునగలును జేత వేయించుకొని యాయన మన్యములలోనికి వెడలిపోయి మరల మాకంటఁ బడలేదు ! కొంతకాలమునకుఁ బిమ్మట మన్యములం దెచటనో యాయన చనిపోయె నని వారి బంధువులు చెప్పిరి.

నాతమ్ముఁడు వెంకటరామయ్య తిరిగి న్యాయశాస్త్రపరీక్షకు చెన్నపురి పోవలసివచ్చెను గావున, అతఁడు తిరిగి వచ్చువఱకును రాజమంద్రిలోని మాతల్లి సంరక్షణమునకై నాభార్య నచట నుంచి, నే వొకఁడనే 1900 జనవరిలో బెజవాడ వచ్చితిని. తమ్ముఁడు