పుట:2015.373190.Athma-Charitramu.pdf/438

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 400

1900 వ సంవత్సరాంతమున మరల ప్రాథమిక పరీక్షలు, నాయఁడుగారియొక్కయు వారియనుచరులయు స్నేహసహవాసములును ! ఇప్పటి ప్రధానోపాధ్యాయులు కల్యాణరామయ్యరుగారు, నామీఁద దయగలిగి, ఆపరీక్షలు చేయుటకు వలసినప్పుడు నన్ను, బోనిచ్చెడివారు. 27 వ నవంబరు తేదీని నేను బండిమీఁద వుయ్యూరు పయనము చేసితిని. 29 వ తేదీని నాయఁడుగారు నేనును బరీక్షలలో నుండఁగ, మాతమ్ముఁడు బెజవాడ కిచ్చినతంతి నా కిచటఁ జేరెను. మాతల్లికి నిన్న మరల మూర్ఛలు ప్రబలముగ వచ్చెనని యందలి దు:ఖవార్త ! పరీక్షలో నేఁ జేయవలసినపని వేగమే పూర్తిపఱిచి, పగలు 12 గంటలకు బండిమీఁద దిరిగి బయలుదేఱి, సాయంకాలమునకు బెజవాడ చేరితిని. అంత రాజమంద్రి తంతి నిచ్చి, తల్లికి నెమ్మది పడెనని తెలిసికొని, మనశ్శాంతి నొందితిని.

అంత తిరువూరు మున్నగు ప్రదేశములలో జరిగిన పరీక్షలలో నాయఁడు గారికి నేను సహాయకునిగ నుంటిని. రాఁబోవు సంవత్సరమున ననంతముగారు మరల నీపాఠశాలకు వచ్చుట కేర్పాటయ్యెను.

14 వ డిశెంబరున మాచెల్లెలు కనకమ్మ సుఖప్రసవమై కూఁతుని గనియెనని విని సంతోషించితిమి. ఆనెల 25 వ తేదీని మేము రాజమంద్రి వెళ్లి, చెల్లెలిని పిల్లను జూచితిమి. శిశువు మిగుల బలహీనగ నుండెను. మోగల్లులో మాతమ్మునిభార్య ప్రసవించె ననియు, కుమారుఁడు కలిగె ననియును మఱునాఁడు మాకుఁ దెలిసి, మే మమితానంద భరితుల మయితిమి.

డిశెంబరు 30 వ తేదీని మధ్యాహ్నమున తమ్ముఁడు నేనును వీథి చావడిలోఁ గూర్చుండి, యిన్నాళ్ల కీశ్వరుఁడు మరల మాకు