పుట:2015.373190.Athma-Charitramu.pdf/426

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 388

కొంటిని. ఆమె యిదివఱకు రెండుకోకలతోనే గడపుకొనుచుండెనఁట! మాయమ్మకు నన్ను గుఱించి దురభిప్రాయములు గలవు. సంసార వ్యవహారములు నాకు నచ్చుచుండలే దని యామె యపోహము ! సత్యము సర్వజ్ఞునికే యెఱుక!"

జూను 18, 19 తేదీలలో నేను వెంకటరామయ్యయును కొక్కొండ వేంకటరత్నము పంతులుగారి బసకుఁ బోయి, ఆయనతో దీర్ఘసంభాషణము చేసితిమి. అరుంధతినిగుఱించి యాయన కొన్ని వినోదకరములగు నంశములను మాకుఁ జెప్పెను. మే మచట నుండునపుడు, మొదటినాఁడు వారి పసిబిడ్డ యుయ్యెలనుండి క్రిందఁ బడి పోయెను. వేగమే వచ్చి బిడ్డను దీయు మని యాత్రమున భార్యను బిలుచునపుడైనను పంతులుగారు గ్రామ్యభాషాప్రయోగము చేయకుండుట మా కాశ్చర్యమును గొలిపెను. !

ఓరియంటలు భీమాసంఘమువారు, మాతమ్ముఁడు వెంకటరామయ్యవలనఁ గొంచె మదనముగ సొమ్ము పుచ్చుకొని, భీమా కంగీకరించుటకు సంతోషించితిమి.

20 వ జూను తేదీని వస్తుఇవులను సరదికొని, భార్యతో నేను బెజవాడ బయలుదేఱితిమి. మాతల్లి మితభాషిణిగ నుండి, మేము ప్రయాణము చేయుటకుఁ గోపించెను ! రాత్రికి బెజవాడ చేరితిమి. పూర్వపు ప్రధానోపాధ్యాయుఁడు వెడలిపోవుటచేత, నాకుఁ బిమ్మటి సహాయాధ్యాపకులగు జాను కల్యాణరామయ్యగారు క్రైస్తవు లగుటచేత నిపుడు అగ్రస్థాన మలంకరించిరి.

22 వ తేది దినచర్యయం దిట్లున్నది : - "క్లార్కుదొర పాఠశాలకు వచ్చెను. 'నాతో మాట్లాడుటకు మీ కవకాశ మిచ్చెదనుఁ