పుట:2015.373190.Athma-Charitramu.pdf/425

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

40. సమష్టికుటుంబ కష్టములు 387

పడితిమి. చిరకాలస్నేహితులగు వీరేశలింగముగారు తనతోఁ జెప్పక తనతమ్ముని కిట్టిపెండ్లి చేయించిరని సుబ్బారావుగారు వీరేశలింగము గారియెడ నాగ్రహముఁ బూనియుండిరని వింటిమి.

23 వ మేయి దినచర్యలో నిటు లున్నది : - "మరల మాయమ్మ, మామఱఁదలితో వైరము సాగించుచున్నది. ఇదివఱకే నా భార్యకు మాతల్లియం దనుగ్రహముగదా! కర్తవ్య మేమి? ఆరోజులలో రాజమంద్రిలో విశూచిజాడ్యములు వ్యాపించియుండెను. 28 వ మేయిని మాపొరుగుననుండు వేపా లక్ష్మీనరసింహముగారికి విశూచి సోఁకెను. ఆయన కిచట భార్యయు, బిడ్డయు మాత్రము గలరు. అంత మే మాయనను వైద్యాలయమునకుఁ గొనిపోయి యచట విడిచివచ్చి, భార్యను పిల్ల వానిని మాయిల్లు చేర్చితిమి. మొదట మే మాయనను గుఱించి భీతిల్లితిమి గాని, కొలఁదిరోజులలోనే యాయనకు నెమ్మది కలిగెను.

మా కెచటనైన పెద్దయప్పు లభించినచో, చిల్లరబాకీలన్నియును దీర్చివేయుద మనుకొంటిమి. రాజమంద్రిన్యాయవాదులు మోచర్ల రామచంద్రరావుగారు తమ బావమఱఁదితో బాగుగ నాలోచించుకొని, నూటికి 12 అణాలు వడ్డీచొప్పున నొక వేయిరూపాయిలు మా నివేశన స్థలముల తనఖామీఁద మా కప్పిచ్చుటకు సమ్మతించిరి. 31 వ మేయి తేదీని మే మంత రామచంద్రరావుగారికి దస్తావేజు వ్రాసి రిజిస్టరు చేయించి, సొమ్ము పుచ్చుకొని, చిన్న యప్పులు తీర్చి, పెద్దఋణదాతలకుఁ గొంచెము కొంచెముగఁ జెల్లించితిమి.

17 వ జూను తేదీ దినచర్యయందు నే నిట్లు లిఖించితిని : - "తమ్మునితో పెద్దబజారు వెళ్లి, అతనిభార్య కీనాఁడు రెండుచీరలు