పుట:2015.373190.Athma-Charitramu.pdf/424

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 386

విద్యార్థు లాసాయంకాలమున విజ్ఞాపనపత్ర మాయన కర్పించిరి. ఆసమయమున మాబోటిప్రత్యర్థి బోధకులను బరిహసింప నొకసంభాషణముకూడ సిద్ధపఱచిరి ! కాని యది పిమ్మట విరమింపఁబడెను. పాటలు, విజ్ఞాపనము, వక్తలలో నొకరగు గోపయ్యగారు చేసిన ప్రసంగమును, సహాయోపాధ్యాయులగు మమ్మునుగుఱించిన యెత్తి పొడుపుమాటలతో నిండియుండెను. ఎంత శ్లాఘింపఁబడినను, చెడుగు మంచిగఁ బరిణమింపఁగలదా ?

ఈసమయమున మాతల్లియు, చిన్న చెల్లెలును మాతో బెజవాడలోనే యుండిరి. మాయమ్మకు వెనుకటి జబ్బు అప్పుడప్పుడు కానబడుచునే యుండెను. వైద్యుని బిలిచి, నేను మందు తెచ్చి యిప్పించితిని. తమ్ముఁడు కృష్ణయ్య తంత్రీశాఖాపరీక్షకు విశాఘపట్టణము వెళ్లి యుండుటచే, నేను రాత్రులు నిద్ర మాని వ్యాధిగ్రస్తయగు మా యమ్మకుఁ బరిచర్యలు చేసితిని.

10 వ మేయి తేదీని నే నొక దివ్యజ్ఞానసమాజ సభ్యునితోఁ బ్రసంగించితిని. తత్త్వశాస్త్రసంబంధ మగు నద్భుత విషయములు నాకును హర్ష దాయకము లయ్యును, వానిని విమర్శించునపుడు దివ్యజ్ఞాన సమాజమువారి పద్ధతిగాక, "లండను మనశ్శాస్త్ర పరిశోధక సమాజము" వారివిధానమె నాకు యుక్తముగఁ దోఁచెను. అంధప్రాయమగు విశ్వాసమునకంటె శాస్త్రబద్ధవిమర్శనమే నాకుఁ బ్రియము.

మే మంత, వేసవిసెలవులకు బెజవాడనుండి వెడలిపోయితిమి. తనతమ్ముఁడు శేషగిరిరావుగా రిటీవల చేసికొనిన వితంతువివాహ మశాస్త్రీయ మని దానిని రద్దుపఱిపింప సుబ్బారావుపంతులు గారు ప్రయత్నించుచుండి రని సాంబశివరావుగారివలన విని మేము విచార