పుట:2015.373190.Athma-Charitramu.pdf/411

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

37. న్యాయవాది పరీక్ష 373

నిలువ లేనట్టుగ నంకె లందు వేయఁబడియుండెను ! లేదని చెప్పివేయుటకు శిష్యుఁడు త్రొక్కిన యీ చుట్టుత్రోవకు నాకు విస్మయము గల్గెను !

వీరేశలింగముగారు, వారిభార్యయు, 3 వ మార్చిని తిరిగి మద్రాసు వెడలిపోయిరి. మేము స్టేషనులో వారిని గలసికొంటిమి. ఈ పెండ్లి విషయమున పంతులుగారు చూపిన సాహసచాతుర్యములను మెచ్చుకొంటిమి.

4 వ మార్చి ఆదివారమున నా దినచర్య యిటు లున్నది : - "భోజన మాలస్యము, భార్యమీఁదికోపము ! చీ ! ఇట్టిబ్రదుకుకంటె మరణ మే మేలు? అవిధేయయగు భార్య, ఎక్కడఁ జూచిన నప్పులు, తగుమాత్రపు రాబడి, ఉన్నతాశయములు - వీనియన్నిటికిని సమన్వయ సామరస్యము లెట్లు పొసంగును ? * * * * * మేము ప్రార్థన జరిపితిమి. 'సత్యము, సర్వశ్వరుఁడు' అను విషయమున నేను ధర్మోపన్యాసము చేసితిని. అంత కృష్ణవైపునకు షికారు. మార్టినో విరచితమగు 'మతపఠనము'ను జదివితిని."

4 వ తేదీని మా కొక యాకాశరామన్న యుత్తర మందెను. లిపి బాగుగ లేనందున నందలిసంగతులు బాగుగఁ దెలియ లేదు. మఱునాఁడు వీరభద్రరావుగారికి నిట్టి యుత్తరము వచ్చిన ట్టాయన చెప్పి, నా కది చూపించెను. నాభార్య మాటకారి యనియు, గర్వి యనియు నం దుండెను ! నలుగురు విద్యార్థు లీయుత్తరముల వ్రాసె నని యందుఁ గలదు. ఇట్టి యాకాశరామన్న యుత్తరములు నే నెప్పుడు నెఱుఁగను! ఖిన్ను రాలగు నాభార్య యీసంగతి వీరభద్రరావుగారి సతితోఁ జెప్పఁగా, సర్వజ్ఞులగు కవు లింటనేయుండఁగా, పరులనుగుఱించి యనుమానప డెద రేమని సాభిప్రాయముగ నాసుదతి ప్రత్యుత్తర మిచ్చెను