పుట:2015.373190.Athma-Charitramu.pdf/395

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

33. చెల్లెలి వివాహము 357

మా తండ్రిగారు నా కిదివఱకు వ్రాసిన రెండు ఉత్తరములును నా కిపుడు పరిచితులయిన హాడ్జిసనుదొరగారి కమెరికా పంపితిని. పైపరుదొరసానికి మూర్ఛా సమయమున వీనిని జూపించి, మా తండ్రిని గుఱించి యామె యేమి చెప్పునో నాకుఁ దెలియఁజేయుఁడని వారినిగోరితిని. పాఠశాలలోఁ బ్రథమోపాధ్యాయుఁడు చేయునక్రమములను గుఱించి నా దినచర్యపుస్తకమం దీక్రిందివ్యాఖ్య గలదు  : -

"ఈక్రైస్తవబృందమువారికి మనుజుల వర్తన మెటు లున్నను వారిమతమే ప్రధానమని తోఁచుచున్నది ! సజ్జనులగు హిందువులకంటె దుశ్శీలురగు క్రైస్తవులే వీరికిఁ బ్రియులు ! దేవదూతవంటి పూతచారిత్రుఁడగు నాయఁడుగారి నీ మతసంఘమువారు తమ విద్యాలయము నుండి వెడలఁగొట్టిరే! శీలసౌష్ఠవముఁ గోలుపోయిన బోధకమహాశయుల నీ పాఠశాలనుండి యెవరును గదలింపలేకున్నారు ! ఇట్టి భూలోక దృశ్యములు దేవతల పరిహాసములకుఁ దావల మగుచున్నవి."

మా చెల్లెలిపెండ్లి 3 వ మేయి తేదీని జరుగునని తమ్ముఁడు వ్రాసెను. కాని, నేను వెళ్లుటకు వలనుపడదని ప్రథమోపాద్యాయుఁడు చెప్పివేసెను. పాఠశాలాధికారికి బందరు జాబువ్రాసివేసి, 1 వ మేయి తేదీని నేను రాజమంద్రి వెడలిపోయితిని. ఎంతో ప్రయాసపడి వస్తు సామగ్రి సిద్ధము చేసితిమి. ఎట్టకేలకు 3 వ తేదీన రాత్రి చెల్లెలి పెండ్లి జరిగెను. నాలుగవనాఁడు పురములోని యుద్యోగి మిత్రులకు విందు చేసితిమి. ఈపెండ్లికి స్వల్పముగనె సొమ్ము వెచ్చించితిమి.

నేను రాజమంద్రిలోనుండు దినములలోనే విడిగా తీయించిన "హిందూ సుందరీమణుల చరిత్రముల" ప్రతులు ప్రచురమయ్యెను. వానిలోఁ గొన్ని విమర్శనార్ధమై పత్రికాధిపతులకుఁ బంపితిని. ఇప్పుడు