పుట:2015.373190.Athma-Charitramu.pdf/391

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32. మనస్తత్త్వ పరిశోధక సంఘము 353

ములేని వారు నడుపు విద్యాలయమునఁ బనిచేయ నాకుఁ గష్టముగ దోఁచెను. ప్రధానోపాధ్యాయునికి నాతోఁగూడ నానాఁట వైమనస్య మేర్పడెను. చిక్కులలోనికి వచ్చి నా సాయ మపేక్షించినపుడు మాత్రము నే నాయనకు హితబోధనము చేయుచుండువాఁడను. ఆయనకు సాంబమూర్తికిని సామరస్యము కుదురుటకై మిగుల ప్రయత్నించితిని.

నే నపుడు చదివెడి పుస్తక మహిమమున, నాదృష్టి యెపుడును ఆధ్యాత్మిక విషయములకును, ముఖ్యముగ మా నాయనను గుఱించిన తలంపులకును బరుగు లెత్తుచుండెడిది. 12 వ ఫిబ్రవరిని మా జనకుని మాసిక సమయమున నేను దు:ఖపరవశుఁడ నైతిని. ఆనాఁటి దినచర్యయం దిట్లు గలదు:

"తండ్రీ నీ వెచటి కేగితివి ? ఇపు డెచట నున్నావు ? భూలోకమున నుండునపుడు నీకు వలయు సౌకర్యము లొనఁగూర్ప లేకుంటిని. ఇప్పటివలె గాఢానురాగమున నిన్నుఁ బ్రేమింపనైతిని. నిన్నుఁ గలసికొని, నీయాలింగనము గైకొన నేను వాంఛించు చున్నాఁడను."

పాఠశాలలో బోధించుటకు ముందుగ గణితపుస్తకమందలి ముఖ్యమగు లెక్కల నింటఁ జేయకుండు దురభ్యాసమువలని నష్టము నా కంతకంతకుఁ స్ఫుటముగ గానఁబడెను. ఒకగణితమె కాదు, ఏపాఠము నైనను ముందు బాగుగఁ జదివియే బోధకుఁడు తరగతిలోఁ బ్రవేశించుట కర్తవ్య మని నా కనుభవ గోచర మయ్యెను. చదువను సెరనుబడి కొంతకాలమునుండి నేను శరీరవ్యాయామము గట్టిపెట్టుట చేత, అనారోగ్యము పాలయితి నని తెలిసికొంటిని. దీని కేమిగాని,