పుట:2015.373190.Athma-Charitramu.pdf/382

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 344

గప్పుద' మను మా యాశ లన్నియును ఆయన మృత్యువువలన వట్టి యడియాస లయ్యెను !

"సంఘసంస్కరణమును గుఱించియును, ప్రార్థన సమాజము నెడలను మాతండ్రిగారి దృక్పథ మెట్టులుండినని మీ రడుగవచ్చును. ఆయన పూర్వాచారాపరుఁ డయ్యును, వివిధప్రదేశములు సందర్శించి విదేశీయోద్యోగులతోడి సంపర్కము గలిగియుండిన హేతువున, ఆయనభావములకుఁ గొంత వైశాల్య మబ్బెను. రాజమంద్రిలో తన కుమారులలో పెద్దవా రిరువురును సంఘసంస్కరణ సమాజమునఁ జేరి పాడగుచుండిరను వదంతులు ప్రబలినను, ఆయనకుఁ జీమకుట్ట దయ్యెను ! పుత్రుల మతాభిప్రాయములపట్ల నాయన మంచి సహన బుద్ధి గలిగియుండెను. నే నిచటి ప్రార్థనసమాజమునఁ జేరి తీవ్రముగఁ బనిచేయుచు, "సత్యసంవర్థనీ పత్రికను" నెలకొల్పి నడుపుచుండెడి 1891 - 92 సంవత్సర ప్రాంతములందు, నేను నాస్తికుఁడనై దుష్కార్యము లాచరించుచుంటి నని పలువురు మొఱలిడినను, ఆయన నిశ్చలుఁడై యుండెను ! మాతండ్రిగారి మత విశ్వాసములు కొంతవఱకు ప్రజాభిప్రాయములకు భిన్నములే. కావున నేకేశ్వరోపాసకుఁడనకు నాయం దాయన కొంత సానుభూతి గనఁబఱుచుచుండువాఁడు.

"లోకవ్యాపారములలో మాతండ్రి న్యాయశీలుఁడు. తా నెన్నఁడును న్యాయసభల కెక్క లేదనియు, అసత్య మాడలేదనియును ఆయన చెప్పుచుండువాఁడు. ఆయన యెవరిని గాని హింసించుటయు, మోసపుచ్చుటయు నే నెఱుంగను. పైకి మొరటుగఁ గానిపించినను, ఆయన కోమలహృదయమున నొప్పువాఁడు.

"మాతండ్రి మంచమెక్కి వేదన పడుచుండెడి యంత్యదినములలో, నలుగురు సోదరులమును రేయుంబవళ్లు ఆయనను కనిపెట్టి