పుట:2015.373190.Athma-Charitramu.pdf/381

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30. జనకసంస్మరణము 343

కూడు నని సామాన్యజనులవలె నమ్మి, ఆయన తన చర్యలను సమర్థించు కొనుచుండువాఁడు.

1882 వ సంవత్సరమున తనయుల విద్యాభివృద్ధినిమిత్తమై మాతండ్రి రేలంగినుండి రాజమంద్రికి సంసారమును తరలించెను. త నున్నతవిద్య నభ్యసింపకున్నను, ఆంగ్లేయ విద్యాసంస్కారము కలిగినఁ గాని తనకుమాళ్లు వృద్ధినొందరని గ్రహించి, ఆయన వారి విద్యకొఱకై పడరాని పాట్లుపడెను. మేము రాజమంద్రిలోఁ జదువుచుండినపుడు, నెలకు పదునైదు రూపాయీల జీతముమీఁద మానాయన గోదావరి విశాఘపట్టణ మండలములందలి గడుమన్యములలోఁ దిరుగుచు, ఒక్కొక్కప్పుడు వన్యమృగములనోటఁ బడ సిద్ధ మగుచు, పుత్రుల విద్యాభ్యున్నతికై యపారస్యార్థత్యాగము చేసెను ! కాని, యిటీవల కొంతకాలమునుండి యాయన వ్యాధిగ్రస్తుఁడై యుద్యోగము లేక యుండుటవలన, కుటుంబము అప్పుల పాలయ్యెను. ఋణములు తీర్చి వేయుటకై కష్టార్జితమగు భూమినంతను అమ్మివేయుట కాయన సంశయింపకుండెను. ఆయన పడిన కష్టముల ఫలితముగ, కుమాళ్లలోఁ బెద్దవార మిరువురము విద్యాపరిపూర్తిచేసి ఉద్యోగమునఁ బ్రవేశించిమి. కాని, మా కష్టమంతగ ననుభవింపకయే, ఆయన పరలోక ప్రాప్తిఁ జెందిరి !

"ఈకష్టసమయమున నా హృదయమును దుర్భరవిషాదముచేఁ గలంచునది, ఆయనయెడ నేను జెల్లింపని విధ్యుక్తములసంస్మరణమే ! పలువిషయములలో మేము మాజనకునిదెస నపరాధులము ! మేము హాయిగ నుండునపుడు, ఆయన కష్టముల పాలయ్యెడివాఁడు. మాకొఱకింతగాఁ బాటుపడిన తండ్రినిఁ దగినట్టుగ సుఖపెట్టమైతిమిగదా యని మేము వగచుచున్నాము. ముం దాయన కెప్పుడో 'కట్నము