పుట:2015.373190.Athma-Charitramu.pdf/367

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

27. ప్రహసన విమర్శనము 329

వైచెను. మతాచార్యులయాంక్షల వీరు లెక్క సేయలేదు. కలమే వీరి ఖడ్గము ! తమపలుకు క్రియారూపము దాల్చుపట్ల నీశూరుఁడు గొంక లేదు. సందియమనుమాట నీతఁ డెఱుంగకయె, సమరము సాగించెను. ఇట్టివాఁడేకదా, నిజమైన శూరుఁడు !

"ప్రకృతమున సంస్కారవేత్తలకు దుస్సాధ్యమగు కార్యముల నీధీరుఁ డానాఁడు ఒక్కరుఁడె సాధించెను. ఇట్టి క్రియాశూరుఁ డయ్యును వీరేశలింగముపంతులు హాస్యరసార్ద్రమగు మనస్తత్త్వముగలవాఁడు. ఇదిగాక పామరజనులతో మెలంగవలసినవాఁడు గావున, ప్రహసన మాయన కరముల కుచితపరికర మయ్యెను. శైలిసొంపులతోను, హాస్యంపుఁదళుకులతోను శోభిల్లెడి యీ ప్రహసనావళియందు, "దుష్టాంగమును ఖండించి శేషాంగస్ఫూర్తికి రక్షచేయు చికిత్సకునివలె" నీ రచయిత, సాంఘికానర్థముల నుఱుమాడెను ! ప్రభుత్వోద్యోగి యొకఁడు లంచము పుచ్చుకొనినను, పెద్దమనుష్యుఁ డొకఁడు వేశ్య నాదరించినను, ఆసంగతి యా వారపు "వివేక వర్ధని" నెక్కిరింపవలసినదే ! వ్యక్తులమనసులు నొచ్చిన నొవ్వనిండు, వ్యాజ్యెముల కెడమిచ్చిన నెడమీయనిండు, వీరేశలింగముపంతులు, సంఘమువారి చిన్న బాధలు లెక్కగొనక, తన విద్యుక్తకార్యములను మోమోటములేక నెఱవేర్పవలసినదియే !

"తమిళపత్రికలు సంఘసంస్కరణమున కంతగ సుముఖములు గావని కొందఱితలంపు. దీనిలో సత్యము లేకపోలేదు. ఏదేశమునఁగాని భాషకు భావమునకును గొంత యానుగుణ్య మేర్పడకతప్పదు. ప్రకృతాంధ్రసారస్వతము సంఘసంస్కారప్రచారమునకు సహాయకారియె యని చెప్పవచ్చును. తెలుఁగుపత్రికలు పుస్తకములును సామాన్యముగ సంఘసంస్కరణానుకూలములె. ఆంధ్రసారస్వతమునకును, ఆంధ్రజనుల