పుట:2015.373190.Athma-Charitramu.pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18. "ప్రాచీన నవీన సైతానులు" 289

నేనీ నూతనాంశము నూఁతగఁగైకొని, బాగుగ నాలోచించి, "ప్రాచీననవీనసైతానులు" అను శీర్షికతో నొక యాంగ్ల వ్యాసమును లిఖించితిని. అది యా 1897 వ సంవత్సరము జులై నెల "సత్యసంవర్థని"లోఁ బ్రచురమయ్యెను. అందలి ముఖ్యాంశము లిందుఁ జేర్చు చున్నాఁడను : -

"సైతాను మన ముఖ్యబంధుమిత్రులలో నొకఁడు ! అతఁడు లేకున్నచో, మన మట్టివాని నొకనినిఁ గల్పించి తెచ్చుకొనవలసినదె ! ఆతఁడు లేని మతసిద్ధాంతము రాణింపదు. అనాదిగసైతాను లోకరంగమున విహరించి, నరుల వినమ్రప్రణామములు చేకొనుచున్నాఁడు. దేవుని కొక గుడి వెలయునప్పటికి, జగతిని సైతానుని కేఁబది యాలయము లేర్పడుచున్నవి.

"సైతానుని గూర్చి మానవుల మనస్సీమల నొక సక్రమపరిణామము గన్పట్టుచున్నది. బైబిలు ప్రాఁతనిబంధనలోని సైతాను వికృత సర్పవేషమున మన తొలియవ్వయగు హవ్వను శోధించెను. నూతన నిబంధనకాలము వచ్చునప్పటికి సైతాను తెలుఁగుమీఱెను. అపరూప ఫల మొకటి చూపించి యబలను మోసగించినసైతా నిపుడు, ఈశ్వరాంశసంభూతుఁ డగు జీససునకు జగత్సామ్రాజ్యము కట్టఁబెట్టెద నని భ్రమ పెట్టఁదలకొనెను ! సైతానుని కిపుడు గావలసినది మానవవైకల్యమును, ఆత్మాపహరణమును ! శోధితునితో పాటు శోధకుని స్వభావమును విచిత్రపరివర్తన మందెను.

"మిల్టనుకవి సృజించిన సైతా నింకను నైగనిగ్యము దాల్చియున్నాఁడు. ఆ కవివర్యుఁడు, తాను రచించిన "విశీర్ణస్వర్ణ" కావ్యమునకు ఆదామునకు మాఱుగ సైతానునె నాయకునిగఁ గైకొ