పుట:2015.373190.Athma-Charitramu.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 272

నాజీవితమును "ఓరియంటల్ భీమాకంపెనీ"లో నాలుగువేలరూపాయిలకు భీమా చేయించి, మూఁడు "పాలిసీలు" తీసికొంటిని. కుటుంబ ఋణము లెప్పటికి తీఱినను, ఆపత్సమయమునం దీభీమాసొమ్ము మావారలకుఁ గొంత లాభకారిగ నుండఁ గల దని నమ్మి, అప్పటినుండియు నేను మనోధైర్యమున నుంటిని.

ఈ సంవత్సరము వేసవిసెలవులలో నెప్పటివలెనే పత్నీ సమేతముగ నేను రాజమంద్రి వెళ్లి యుంటిని. అప్పుడు నాభార్య తీవ్రజ్వరముచేఁ గొన్నిదినములు బాధపడెను. రెయిలువేవైద్యుఁడు జే. రంగనాయకులు నాయఁడుగారు మం దిచ్చి వ్యాధినివారణము చేయఁగా, ఆమె తన పుట్టినింటికి కట్టుంగ వెడలిపోయెను. అచట వెంకటరత్నమునకు విడువని దారుణజ్వరము వచ్చుచుండె నని మామామగారు కొలఁదిదినములలోనే నాకొఱకు రాజమంద్రి బయలుదేఱి వచ్చిరి. నే నపుడు కట్టుంగ వెళ్లి చూడఁగా, జ్వరముతీరు సవ్యముగ లేదు. ఆ కుగ్రామమునుండి రోగిని గదల్చి రాజమంద్రికిఁ గొనిరానిచో నతఁడు జీవింప నట్టుగఁ దోఁచెను. అంత నా వడివేసవిదినములలో నొకరాత్రి సవారిలోఁ గూర్చుండఁబెట్టి రోగిని రాజమంద్రి చేర్చితిమి.

రాజమంద్రి ఇన్నీసుపేటలో నిదివఱకు మాకుఁగల నివేశమునకుఁ జేరిన యింకొక స్థలమును మాతండ్రి యిటీవల కొనెను. ఆరెండింటియందును నుండినవి తాటియాకులయిండ్లే యైనను, సొంత యింటఁ గాపురము మాకు సుఖప్రదముగ నుండెను. మాతలిదండ్రులు, సోదరులును వెంకటరత్నమున కమితముగఁ బరిచర్యలు చేసిరి. ఒక నెలవఱకును, సన్నిపాతజ్వర మాతనిఁ బీడించెను. ఆతని ప్రాణమును గుఱించి మే మాదినములలో నధైర్యపడినను, దైవానుగ్రహమున నెట్టకేల