పుట:2015.373190.Athma-Charitramu.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 266

మున్నగు వానియాకారములు చిన్నచిన్న కొయ్యబొమ్మలరూపమునఁ జెక్కఁబడి, కొద్దినెలల కమ్మఁబడుచుండెను. ఈబొమ్మలు కొన్ని కొని మేము రెయిలులోఁ గూర్చుండి, మధ్యాహ్నమునకు బెజవాడఁ జేరితిమి.

ఆ దసరా సెలవులలో "జనానాపత్రిక"కుఁ గ్రొత్తచందాదారులను సమకూర్చుటకై 27 వ సెప్టెంబరున బుచ్చయ్యపంతులు గారితోఁ గలసి నేను గుంటూరు వచ్చితిని. ఆయనద్వారా నాకు కళాశాలలో నుపన్యాసకులగు పసుపులేటి వెంకటకృష్ణమ్మనాయఁడు గారు పరిచితులైరి. ఆయన సజ్జనులు, విశాలహృదయలును, గుంటూరు పురపాలక సంఘాధ్యక్షులగు నాయఁడుగారి కచట మిగుల పలుకుబడి కలదు. ఆయన నన్నుఁ దమస్నేహితులయిండ్లకుఁ గొనిపోయి, నా పత్రికకుఁ జందాదారులై స్త్రీవిద్యకుఁ బ్రోత్సాహము గలిగింపుఁ డని వారితో నొక్కి చెప్పిరి. ఈకారణమున గుంటూరులో నాపత్రికకుఁ గొందఱు చందాదారు లేర్పడిరి. ఈలాభమునకంటె నెన్ని మడంగులో విలువగల సహృదయులగు నాయఁడుగారి పరిచయలాభము నాకీ సందర్భమునఁ జేకూరెను.

రాజమంద్రిలో వ్యాధిగ్రస్తులైన తమ యన్న రంగనాయకులునాయఁడుగారిని సందర్శించుటకై చెన్నపురినుండి డాక్టరు నారాయణస్వామినాయుఁడుగారు అక్టోబరు 2 వ తేదీని బెజవాడ వచ్చిరి. బెజవాడ పరిసరములనుండు బుడమేరునది అంతకుఁ గొన్నిదినముల క్రిందటనె కురిసిన యధికవర్ష ములవలన నకస్మాత్తుగఁ బొంగుటచేత, రెయిలుకట్ట కాలువగట్టులును తెగిపోయెను. ఆకారణమున రెయిలు బెజవాడనుండి యేలూరునకు సరిగా నడచుచుండుట లేదు. పడవల రాకపోకలు కూడ క్రమముగ లేవు. నారాయణస్వామి