పుట:2015.373190.Athma-Charitramu.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12. నిత్య విధులు 261

పెత్తండ్రి పద్మరాజుగారిని జూచుటకై మే మంత రాత్రికి పెనుగొండ వెడలిపోయి మఱునాఁడు రేలంగి వచ్చితిమి. ఆదినములలో రేలంగిగ్రామస్థులు కొందఱు రెండుకక్షలక్రింద నేర్పడి, ఒకరితో నొకరు ఘోరయుద్ధము జరుపుచుండిరి. ఈద్వంద్వయుద్ధ సందర్భమున, నిరపరాధులగు మాబోటివారును చిక్కులలోనికి రావచ్చునని నేను భీతిల్లితిని. భూములయమ్మకమునకై మాతండ్రి యంతట చుట్టుప్రక్కల గ్రామములు తిరిగెను. అపుడు మేము రేలంగి మండపాక కేతలి వడ్డూరు గ్రామములలోఁగల మాభూము లమ్మివేసితిమి. మా పెద తండ్రికుమారుఁడు మా యుభయ కుటుంబములకు నిపుడు జరుగు వ్యాజ్యెములకు వివాదములకును ముఖ్యకారణ మని వింటిమి. అతఁడు తన తప్పునొప్పుకొనినను, నేను జెప్పిన సామమార్గమునకు సులభముగ నొడంబడలేదు. ఎటులో మే మంత సమాధానపడితిమి.

ఇంకముందునుండి కుటుంబవ్యయములకుఁ గొంత సొమ్ము నెలనెలయును సరిగా రాజమంద్రి పంపుచు, కొంత సొంత కర్చులకు వ్యయపఱచుకొని, మిగిలినదానితో నప్పులు తీర్చివేసెద నని నేను నిర్ధారణచేసికొంటిని. మేము రాజమంద్రి వచ్చునప్పటికి, మాతల్లియుఁ దమ్ముడును జబ్బుగ నుండిరి. గర్భసంబంధమగు వ్యాధికి లోనయిన నాభార్య, ఇంటఁ దాను బడుకష్టములనుగుఱించి మొఱపెట్టెను. స్కాటు మెట్కాపు దొరలను సందర్శించి, పాపయ్య మృత్యుంజయరావుగార్లు మున్నగు స్నేహితుల వీడుకొలంది, నేను పత్నీ సమేతముగ జూను 19 వ తేదీని బెజవాడ బయలుదేఱితిని. తల్లిని గూర్చియు తమ్ములనుగూర్చియు నా కెంతో విచారము గలిగెను. వారలకుమాత్రము నాచిక్కు లెఱుకపడవుగదా ! మే మంత స్టీమరు