పుట:2015.373190.Athma-Charitramu.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 260

డెను. దానిచెంతనె వృద్ధురాలియస్తికలు చేర్పఁబడెను. నాయఁడుగా రాసమయమున ప్రార్థన సలిపిరి.

అప్పు పంచుకొని, నావంతు తీర్చివేయుమని తలిదండ్రులు పెద్దతమ్ముఁడును నా కిపుడు బోధించిరి. ఎటులో నన్ను ఋణవిముక్తునిగఁ జేసినచో నొక వేయిరూపాయి లిచ్చెద నని నేను వారలకుఁ జెప్పితిని. ఇది యుక్త మని మా మామగారును అభిప్రాయమందిరి.

నే నా రోజులలో సత్యనాధము కృపాబాయి గారిచే విరచితమగు "కమల" చదివి వినోదించితిని. మల్లాది వెంకటరత్నముగారి కోరిక ననుసరించి మాతమ్ముఁ డిదివఱకె యీపుస్తకమును తెనుఁగు చేయఁగా, దానిని సవరించి యిపుడు చెన్నపురికిఁ బంపితిని.

ఆసెలవుదినములలో, పాపము, మృత్యుంజయరావునకు వ్యాధి ప్రబలమయ్యెను. అతనిఁ జూచి మిత్రులు విషాదమందిరి. మా తల్లికీ వేసంగిలో మూర్ఛ యంకురించెను. ఆమె బాధకై మేము విచారించుచుండువారము. యం. యే. పరీక్షకై నే నీ సెలవులలో రాజమంద్రికళాశాలా గ్రంథాలయమందలి యుద్గ్రంథములు కొన్ని చదివి యందలి ముఖ్యాంశములను నాపుస్తకములలో వ్రాసికొంటిని.

25 వ మెయి తేదీని తండ్రి, పెదతమ్ముఁడు నేనును మా భూముల విక్రయమునకై రేలంగి పయనమై వేలివెన్ను చేరితిమి. అచట మాతమ్మునిమామ నరసయ్యగారు మాకుఁ గానఁబడి, తమ కూఁతుని శుభకార్యమునకు వలసిన ప్రయత్నములు జరిగిన వనియు, ఆలస్య మైనచోఁ దనకెంతో ధననష్ట మగు ననియు మొఱవెట్టెను. వధూవరుల కింత లేఁబ్రాయమున శుభకార్యము తలపెట్టగూడ దని నేను జెప్పివేసి, ఆయనపుర్ణాగ్రహమున కాహుతియైతిని ! మా మూఁడవ