పుట:2015.373190.Athma-Charitramu.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12. నిత్యవిధులు 259

బుస్తకములు ముందు వేసికొని కూర్చుండువారము. కాని, కడుపులో నాహారము లేక దేహమున నిస్సత్తువుగ నుండు సమయమునఁ జదువుట మంచిది కా దని తెలిసినవారము గాన, మే మిరువురమును నానురొట్టెను, కోకోను స్వీకరింప నారంభించితిమి. కోకోనీరు త్వరగఁ జేసికొనుటకు మరప్రొయ్యి మున్నగు పరికరములు సిద్ధము చేసికొంటిమి. కాని, యీ యుపాహార వస్తువులు సమకూర్చుకొను నాటోపమునందే విలువగల ప్రాత:కాలము వ్యయమగుచు వచ్చెను ! ఇదివఱకు పరగడుపునఁ బనిచేయుట కష్టముగఁ దోఁచెడి మాకిపుడు, నిండుకడుపుతోఁ బరిశ్రమించుట కష్టతరమయ్యెను ! అంతట, ఫలాహారములతో నారంభమైన ప్రొద్దుటి చదువు సాగియు సాగకమునుపే, సకాలమున పాఠశాలఁ జేరుటకై మేము భోజనసన్నాహము చేయవలసివచ్చెడిది ! చదువు వంటఁబట్టుట సందేహాస్పదమైనను, అజీర్ణరోగము, ఫలాహారాభ్యాసమును మాత్రము వెంటఁబడుట స్పష్టమని మే మంత భయపడి, యుపాహారములను త్యజించి యదేచ్ఛగ నుంటిమి !

పాఠశాలలో నంత నర్థసంవత్సర పరీక్ష లారంభమయ్యెను. పరీక్షాపత్రము లన్నియు నేనే చేతియంత్రమున నచ్చొత్తితిని. దీనివలనఁ దమపని సులువయ్యెనని సంతసించుటకు మాఱుగఁ గొందఱు బోధకులు, తమ పరీక్షాపత్రములు వేళకు నా కందీయక, నన్నుఁ జిక్కులుపెట్టి, మీఁదుమిక్కిలి నిందింప సాగిరి ! ఎట్టకేలకు పరీక్షలు పూర్తికాఁగా, వేసవికి పాఠశాల కట్టివేసిరి. 3 వ మేయి తేదీని, ఏప్రిలు "జనానాపత్రిక" నందుకొని, మేము రాజమంద్రి వెడలిపోయితిమి.

మే 10 వ తేదిని మిత్రుఁడు రంగనాయకులు నాయఁడుగారి యత్తగారు చనిపోఁగా, ఆమెశవమును కోటిలింగక్షేత్రమునకుఁ గొని పోయిరి. అదివఱకె యచట నాయఁడుగారి భార్యసమాధి వెలసియుం