పుట:2015.373190.Athma-Charitramu.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 246

తిమి. తమ్ముఁడు కృష్ణమూర్తి సన్నిపాతజ్వరముచేఁ బీడితుఁడై యుండెను. నాలుగుదినములలో జరుగఁబోయెడి మాచెల్లెలి వివాహమునకు బంధువులను బిలుచుటకై మాతండ్రి రాజమంద్రినుండి వెడలిపోయెను. అర్తమూరు సంబంధము మే మంత నిశ్చయించి, పెండ్లికుమారుని తలిదండ్రులకుఁ దెలియఁబఱచితిమి. ఒక మూల పెండ్లిపనులు, వేఱొక మూల రోగికిఁ బరిచర్యలు !

వివాహదినమగు బుధవారము సమీపించినకొలఁది, మా యలమట మఱింత హెచ్చెను. బంధువుల పిలుపునకుఁ బోయిన మా తండ్రి పెండ్లి వెనుకటిరోజునకైన నిలు సేరలేదు ! తమ్మునివ్యాధి నిమ్మళింపలేదు. ఎట్టకేలకు మంగళవారమురాత్రికి మాజనకుఁడు బంధుసమేతముగ నింటికి వచ్చెను. పెండ్లివారుకూడ ధవళేశ్వరమునకు వచ్చియుండిరని తెలిసెను.

పెండ్లికొమార్తెకు జ్వరము వచ్చుటచే వివాహము మఱునాఁడు జరుగలేదు. ఎట్టకేలకు 25 వ అక్టోబరు, గురువారము ప్రాత:కాలమున ధవళేశ్వరమున జనార్దనస్వామి యాలయమున మాచెల్లెలు కనకమ్మను పులుగుర్త సీతాపతిరావున కిచ్చి వివాహము చేసితిమి. మాతమ్ముఁడు కృష్ణమూర్తి వ్యాధిగ్రస్తుఁ డగుటవలన వానిని విడిచి మా తలిదండ్రులు రాఁజాలక పోయిరి. కావున నేను భార్యయును కన్యాదానము జరిపితిమి. ఒక జాములోనే వివాహము పూర్తి కాఁగా మేము రాజమంద్రి వచ్చి చేరితిమి.

అంత మా తమ్ముని జ్వరము మఱింత హెచ్చెను. రంగనాయకులు నాయఁడు గారు మిగుల శ్రమపడి రోగి కౌషధము లిచ్చుచుండిరి. కొలఁది దినములలోనె పెండ్లికూఁతునికీ జ్వరము సోఁకెను. నేను