పుట:2015.373190.Athma-Charitramu.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 234

క్లార్కుదొర బెజవాడ వచ్చు ననియును, అపుడాయనతోఁ దాను నాకష్టములఁగూర్చి చెప్పెద ననియును, అనంతముగారు వాగ్దానముఁ జేసిరి. ప్రకృతఁపుఁబని నాకు ఖాయము చేయుఁడనియు, రాఁబోవు వత్సరమున యల్. టి. పరీక్ష పూర్తిచేసినచో నెనుబదిరూపాయి లీయుఁడనియు, పరీక్షయందు తప్పిపోయినచో నీడెబ్బదియే చాలు ననియు నేను బలికితిని. నా యభీష్టము నెఱవేఱుచో నే నిచటినుండి కదలనక్కఱయె లేదుగదా !

జూలై 23 వ తేదీని క్లార్కుదొర మాపాఠాశాలకు వచ్చి, నా తరగతులలోఁ గొంతసేపు కూర్చుండి, నా బోధనమునకు సంతృప్తి నొందితి ననియు, నాకోరికను జెల్లింతుననియును జెప్పి, నా మనోనిశ్చయ మేమని యడిగెను. ఆరోజుననే మా తమ్ముని యొద్దనుండి వచ్చిన యుత్తరములో, నేను బెజవాడ విడిచి క్రొత్తప్రదేశమున కేగుట శ్రేయమని యుండుటచేత, నా నిర్ధారణమును వెల్లడించుట కొకవారము గడువుఁ గైకొంటిని. 28 వ తేదీని రాజమంద్రి వెళ్లి పరిస్థితులు కనుఁగొంటిని. రాజమంద్రి సబుకలెక్టరే అమలాపురము తాలూకాబోర్డు ప్రెసిడెంటు. ఆ యుద్యోగస్థానమున నడుగఁగా, నాకు హుకు మింకను పంపలేదనియు, అచట నా కెన్నటికి నఱువదిరూపాయలజీతమే యిచ్చెద రనియుఁ దేలెను ! ప్రథమోపాధ్యాయుఁడు నిరంకుశాధికారి యనికూడఁ దెలిసెను ! బెజవాడ "వేడిమంగల"మైనను, నాగరికత కావాసమయిన యానగరము విడిచి, పూర్వాచార పరాయణతకుఁ బట్టుగొమ్మయైన అమాలాపురగ్రామము వెళ్లుట శ్రేయము గాదని నాకుఁ దోఁచెను. బంధుమిత్రుల నటులె చెప్పిరి. కావున నేను బెజవాడలోనే యుండుటకు నిశ్చయించి, ఆసంగతి