పుట:2015.373190.Athma-Charitramu.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 224

"ఇస్లాము విశ్వాసము" అను నాంగ్లగ్రంథము నే నపుడు చదివి, మహమ్మదీయ మతసిద్ధాంతములను గ్రహించితిని. ఆపుస్తక మందలి ముఖ్యాంశములను నేను వ్రాసిపెట్టుకొంటిని. ఎంతో శ్రమకోర్చి నే నాకాలమునఁ జదివి యిట్లు సారము వ్రాసికొనినవ్రాఁత పుస్తకము లింకను నాయొద్ద నున్నవి.

6 వ మేయితేదీని స్నేహితులు గంగరాజు కనకరాజుగార్లు చెన్నపురినుండి వచ్చిరి. మేము మువ్వురమును గూడి యానాఁడు వీరేశలింగముగారి రాకకై బెజవాడరెయిలుస్టేషనునొద్దఁ గనిపెట్టుకొని యుంటిమి. పంతులుగారు భార్యాసహితముగా వచ్చి మాపొరుగున నుండు పాటిబండ వెంకటరమణయ్యగారి యింట విందారగించి, వెంటనే చెన్నపురి రెయిలెక్కిరి. మేము వారిని సాగనంపి వచ్చితిమి. మఱునాఁ డాస్నేహితులు రాజమంద్రి వెడలిపోయిరి. మాపాఠాశాలను వేసవికి మూయుటచేత, మేమును 8 వ తేదీని రాజమంద్రి బయలుదేఱితిమి.

3. వేసవిసెలవులు

9 వ మెయి తేదీని తమ్ముఁడు వెంకటరామయ్యతోఁ గూడి రాజమంద్రియందలి స్నేహితులను సందర్శింపఁ బోయితిని. 'సత్యసంవర్థనీ' సంచికను వేగమే ముద్రింపుఁ డని "వివేకవర్థనీ ముద్రాక్షరశాల"లోఁ జెప్పి, మిత్రులు పాపయ్య, రంగనాయకులు నాయుఁడు గార్లను వీక్షించితిని. మధ్యాహ్నము మృత్యుంజయరావు, నరసింహరాయుఁడుగార్లనుఁ జూచివచ్చితిని. మృత్యుంజయరా విపుడు నవీనముగ రాజమంద్రిలో స్థాపితమైన దొరతనమువారి బోధనాభ్యసన కళాశాలలో నుపన్యాసకుఁడు. నరసింహరాయుఁడుగా రేతత్కళా