పుట:2015.373190.Athma-Charitramu.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 218

యిలు కాక, అఱువదియే నాకు జీతమిచ్చెద నని యాయన తెలియఁబఱిచెను ! ఈ సంవత్సరమైన డెబ్బదిరూప్యము లిప్పింపుఁ డని వారికి వ్రాసికొని, ఆనాఁడే తమ్ముఁడు వెంకటరామయ్య పంపినజాబు ననుసరించి, అమలాపురము పాఠశాలలో ద్వితీయోపాధ్యాయుని యుద్యోగమునకై ప్రయత్నింప నే నారంభించితిని !

నా మనోవ్యాకులతను బూర్తిచేయుట కీ యుదంత మొకటియే చాలదేమో యనునట్టుగ, ఆ మొదటిదినములలో మాకింకఁ గొన్ని యిక్కట్టులేర్పడెను. దినదినప్రవర్ధమానమగు బెజవాడవేసవియెండలు మా యుభయులను మిగుల వేధించెను. ఇరువురమును కురుపులచేత బాధపడితిమి. కడుపునొప్పి, జ్వరము మున్నగు వ్యాధులు నా భార్యను బీడించెను. ఆ కష్టసమయములందు, ఇంటియజమానురాలగు శ్రీమతి సుబ్బమ్మగారు మా కమితముగఁ దోడ్పడిరి. మంచమెక్కిన నాభార్యకు చికిత్సాపరిచర్యలు చేయుచును, నాకు వేళకు నన్నపానము లొనఁగూర్చుచును, ఆయిల్లాలు మాకు రెండవతల్లి యయ్యెను !

16 వ మార్చిని మాపాఠశాలలోని "విద్యార్థిసాహితీసమాజము"వారు నన్నుఁ దమ యధ్యక్షునిగ నెన్నుకొనిరి. ఆ సమాజమునకు నే జేయవలసిన సేవనుగూర్చియు, దాని యభ్యున్నతికై నే గావింపవలసిన యపారప *శ్రమనుగుఱించియుఁ దలంచుకొనినపుడు, నా మేను పులకరింపఁదొడంగెను ! ఇంతియ కాదు, పాఠశాలలోని యనుదిన విద్యాబోధనాకార్యనిర్వహణమందే నాకు నిరుపమానందము గాన వచ్చెను. సతికి విద్యగఱపుట ముఖ్యవిధిగ నే జేసికొని, భారతాది గ్రంథములందలి కథలును, 'సత్యసంవర్థనీ' పత్రికకు నేను వ్రాయు వ్యాసములును, ఆమెకుఁ జదివి వినిపించుచుండువాఁడను. ఆబాలకు ముఖ్యముగ మతబోధనము చేయ నాసక్తి గొనియుంటిని. సంఘ