పుట:2015.373190.Athma-Charitramu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సమాజమునందెకాక, మాతృసంఘమునందును నాకనులకు గోచరించెను. ఇంతియకాదు. కొన్ని సమయములందు క్రొత్తగ వెలసిన సమాజములలో నూతనాశయములు వేవేగమె వన్నె వాయుటయు, మాతృసంఘమె యుదారనవీనభావములతో భాసిల్లుటయు మనము కాంచుచున్నాము. కావుననే, హిందూమతముపట్ల యౌవనమున నాకుఁ గలిగిన నిరసనము నానాఁట తొలఁగిపోయి, అందలి యుత్కృష్టాదర్శములు హృద్యము లయ్యెను. భగవంతునిప్రాపున సంసారయాత్రయందు ధన్యులు కాఁగోరువారు, నామరూపముల విషయమై లేనిపోని దురభిమానములకు లోనుగాక, సర్వమతధర్మములును సాధనములుగఁ జేకొని సత్యము గ్రహింపవచ్చు నని నేను దలంచితిని."

ఆత్మచరిత్రము, గృహవిద్యావిశ్వరంగములయందు, భక్తి జ్ఞానకర్మయోగముల సాధనమునను పూర్ణమైన ఆత్మయోగాభ్యాసమునకు సకలజనులకును వారి సంస్కారమున కనురూపముగను వినియోగపడుచున్నది. జీవయాత్రయం దనిత్యములైన నామరూపావరణము లంతరించి నిత్యమైన యాత్మావరణము జీవిత పరిణామము నందు సార్థకమగుచున్నది. పాఠకమహాశయులు దీర్ఘమైనను భావగర్భితమైన ఆత్మచరిత్రమును చదివి పరిశోధించి ఆత్మచరిత్రమును సార్థకము చేయుదురుగాత. ఈ కృతికి పరిచయవాక్యములను వ్రాయుట కవకాశ