పుట:2015.373190.Athma-Charitramu.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

49. విద్యార్థిదశ 209

నే నిచ్చిన విమర్శనపాఠములందు నేను గురువులయొక్కయు సహాధ్యాయులయొక్కయు సదభిప్రాయమును బడయనేరకుంటిని. శరీరము నందలి నీరసము దీనికిఁ దోడుపడుటచేత, నాబోధన మెవరికిని నచ్చ కుండెను. సహజమగు వేగిరపాటునకు సభాకంపము, శరీరదుర్బలతయుఁ దోడై, పలుకునకు తొట్రుపాటును, దేహమునకు వణఁకును అట్టిసమయములందు గలిగించెడివి ! ఒకప్పుడు కళాశాలాధ్యక్షుఁడు విమర్శనము చేయుటకై కూర్చుండిన నా సహపాఠులకు నన్నుఁ జూపించి, "గుడికిఁ గొనిపోవు మేఁకపోతువలె నీబోధకుఁ డెట్లు భయమందుచున్నాఁడో పరికింపుఁడు !" అని పలుకునపుడు, నాయలజడి మఱింతహెచ్చెను. అంత నాసహాధ్యాయులలో పెద్దవాఁ డొకఁడు లేచి, "ఇతనికి జబ్బుగా నున్నది. మీ ఱెఱుఁగరు కాఁబోలు !" అని నిర్భయముగఁ జెప్పఁగా, నే నానాఁడు చెప్పవలసిన పాఠము మఱుసటివారమునకు వాయిదావేయఁబడెను. రెండవమాఱుకూడ నే నిట్టి దుస్థితినే యుండుటఁ జూచి, వెనుకటి సహాధ్యాయుఁ డొకయుపాయము చేసెను. నే నపుడు బోధించిన పాఠము బాగుగ లేదని యందఱికిని దెలిసియె యుండెను. ఈయభిప్రాయ మధ్యక్షుఁడు పుస్తకమున లిఖించినయెడల నా కపకారము కలిగెడిది. తమతమ యభిప్రాయము లీయుఁ డని యధికారి సదస్యుల నడిగెను. నాయాశ్చర్య మేమి చెప్పను ! నాపాఠము మిక్కిలి చక్కగ నుండెనని కొందఱును, మార్గప్రదర్శకముగ నుండెనని కొందఱును జెప్పివేసిరి ! ఈశ్లాఘనము వినిన యధ్యక్షుఁడు తనయభిప్రాయమునే మార్చుకొని, నాపాఠము మొత్తముమీఁద బాగుగనే యుండె నని నిర్ణయించెను !

బోధనాభ్యసనకళాశాలలోని పని సామాన్యముగ బూటక మని యందఱు నెఱిఁగినదియె ! ఐనను, నాటకరంగమున కేతెంచిన