పుట:2015.373190.Athma-Charitramu.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

46. వేసవి సెలవులు 197

తనయం దీమాత్రపు విశ్వాస ముంచనేరని నాబోటివారలతోఁ గలసి సమాజసంస్థలలోఁ దా నెట్లు పని చేయ నేర్తు నని పంతుల బెదరింపు. పెద్దవాఁడగు పంతులమాట శిరసావహింపుమని కనకరాజుని హితోపదేశము. అహంభావ స్వార్థపరత్వముల ప్రేరణమున నే నిట్లు మిడిసి పడుచుంటి నని వా రిరువురు న న్నంత నిందించిరి. అంత్యనిష్ఠురమున కంటె నాదినిష్ఠురమే మేలని నేను స్థిరత్వముఁ బూనియుంటిని. ఆపత్రిక నొకన్యాయవాది నడపుట కంగీకరించె నని తెలిసి, నా కీగండము తప్పుటకు నే నంత సంతోషమందితిని !

11 వ జూన్ తేదీని, ఆఱు నెలలపిల్ల యగు మాచిన్న చెల్లె లేకారణముననో విడువక యేడువ నారంభించెను. దేహముమీఁద దానికి పొక్కులు గానిపించి, బాధ యతిశయించెను. శస్త్రము చేసినయెడల కురుపులు నిమ్మళించు నని నామిత్రుఁడు రంగనాయకులునాయఁడు గారి యభిప్రాయము. దీనికి మాతలిదండ్రులు పెద్దతమ్ముఁడును సమ్మతింపలేదు. శస్త్రము చేయించినఁగాని రోగి జీవింపదని నానమ్మకము. అంతకంతకు రోగి కడు బలహీనయై వేదన నొందుచుండుటచేత మా కెల్లరకు మనస్తాపము గలిగెను. బంధువులప్రేరణమువలన మా తలిదండ్రులు బాలిక నంతట సావరము గొనిపోయి, అచటివైద్యునిచే మం దిప్పించిరి.

"ఆస్తికపాఠశాల"స్థాపనమునుగూర్చి నేను మిత్రులును బాగుగ సంభాషించుకొంటిమి. మృత్యుంజయరావు భార్యను దీసికొని సైదాపేటనుండి యిక్కడకు వచ్చెను. పాఠశాలస్థాపనమునుగుఱించి యతని కెక్కువయలజడి గలిగెను. ఈవిషయమై కళాశాలాధ్యక్షులగు మెట్కాఫ్‌దొరను జూచి మాటాడుట ముఖ్య మని మాకుఁ దోఁచెను. కాని, "వివేకవర్థని" పత్రికాధిపత్యమునుగుఱించి నేజూపిన