పుట:2015.373190.Athma-Charitramu.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42. సౌఖ్యదినములు 183

చుండెను. సంస్కరణాభిమానులగు చిన్నలు పెద్దలు, విద్యార్థులు విద్యాధికులును పలుమా ఱచట సమావేశ మగుచు నొకరి యూహా పోహము లొకరు గ్రహించుచుండిరి. రాజమంద్రిలో జరుగు సంస్కరణకార్యప్రణాళిక యంతయు నిచట నారంభమై, మున్ముందుగఁ బ్రచుర మగుచువచ్చెను.

సంస్కరణ పక్షమున కెట్టి సంబంధము గలవారు పట్టణమునకు వేంచేసినను, వారలను గూర్చిన వార్తలు ప్రథమమున నిచ్చటనే ప్రభవించుచుండెను. ఆసమయమున నొక భూతవైద్యుఁడు రాజమంద్రి వచ్చి, ఎవరియింటనో బసచేసి, వైద్యము చేయుచుండెను. మే మాయనతో వాద ప్రతివాదనలు చేయుటకు వారియొద్దకుఁ బోవుచుండెడివారము. దయ్యములను జూపింపు మనియు, పట్టింపు మనియు, మాలోఁ గొందఱ మాయనతో డీకొని వాదించితిమి. ఆయన యట్లు చేసెద నని పలికియు, తుద కేమియుఁ జేయలేక వెడలి పోయెను. హిందూమతము, దివ్యజ్ఞాన సమాజములను గూర్చి ప్రసంగించుటకు, మేము సాహసమున బయలుదేఱుచుందుము.

మాయందఱికిని వివాహ సంస్కరణము ప్రియతమమగునంశము. వితంతూద్వాహములు చేసికొనినవారిలోఁ బెక్కండ్రు మాకు సావాసులే. వారియిండ్లు మామేడ కంటియె యుండెను. వారినిజూచి పోవుటకు వచ్చెడి వీరేశలింగము పంతులు మున్నగు సంస్కర్తలు, మామేడమీఁదికి వచ్చి మాతో మాటాడి పోవుచుందురు. మే మచట నుండు దినములలో రెండుమూఁడు వితంతూద్వాహములు దగ్గఱ యింటిలోనే జరిగెను. ఆ పెండ్లి పెద్దలలో మామిత్రులె ముఖ్యులు. మృత్యుంజయరావు ప్రోత్సాహముననే యందొక పెండ్లి జరిగెను. ఆ పెండ్లికుమారునికి పెండ్లికుమార్తెకును పునర్వివాహావశ్యకతను