పుట:2015.373190.Athma-Charitramu.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 180

జికులకును పూర్వకాలమున పోరు ఘోరముగఁ జెలరేగుచుండెడిది. సెట్టిగారి యభిప్రాయములందుఁ గానిపించిన లోపములను నేను గర్హించి, ఖండించి, ఆ సమాజ సిద్ధాంతములమీఁద నాకుఁగల కసి తీర్చుకొంటిని.

ఆకాలమునందు ప్రహసనరూపమున, వాదప్రతివాదములు జరుపుట యాచారమయ్యెను. ప్రహసనమెంత వ్యక్తిగత మైనను సరే, అది తగినంత కఱకుగను, చమత్కారముగను నుండినచో, పాఠకుల కుల్లాసము గలుగుచుండెడిది !

1 వ అక్టోబరున మా కందిన "ఆంధ్రప్రకాశిక" సంచికలో నొక ప్రహసన ముండెను. అందు వీరేశలింగముగారిని, కనకరాజు సాంబశివగార్లను, మాఱు పేరులు పెట్టి, మాప్రతికక్షులు వెక్కిఱించి వినోదించిరి.

ప్రతికక్షులగు భిన్నకూటస్థు లొకరి నొక రిట్లు నిరసించుకొనుట స్వాభావికమే. కాని, మా సమాజసభ్యులు రానురాను తగినంత పరస్పర ప్రేమానురాగములు లేక, ఒకరియం దొకరు ఈర్ష్యా ద్వేషములు వహించి భిన్నభిన్న కక్షలక్రింద నేర్పడిరి. సత్యసంవర్థనీ పత్రిక నాధారము చేసికొని, నేను ప్రార్థన సమాజ వ్యవహారము లన్నిటిలో నిరంకుశ ప్రభుత్వమును నెఱపుచున్నా నని మామిత్రుల యపోహము ! నాస్నేహితుఁడు కనకరాజు రెండుమూఁడు సారులు నాయందు మిత్రుల కేర్పడిన యీ ద్వేషభావమును గూర్చి నాయొద్ద ప్రస్తావించెను. కాని, యాతఁడు వేగిరపాటుచేత మిత్రులమీఁద ననగత్యమగు ననుమానములు పడుచుండెనని నేను దలంచుచుండెడి వాఁడను. సమాజాభివృద్ధికై యెంతయో కృషి సల్పుచు, సమాజ