పుట:2015.373190.Athma-Charitramu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేంకటశివుడుగా రాత్మచరిత్రమునందు 63 ఏండ్ల యనుభవానంతరము వ్రాసిన భావములు పండితపామరులకు మననార్హములు:

"చిన్ననాఁడు నే ననుకొనినట్టుగ పాఠశాలావరణమునకు వెలుపలిప్రదేశము పాపభూమి కాదనియు, వృత్తులందు పవిత్రత్వాపవిత్రత్వములు నియతములు కావనియు, సంకల్పశుద్ధియె సామాన్యముగ నేకార్యప్రాశస్త్యమును గాని నిర్ణయించు ననియు నానాఁట నాకు నచ్చెను. లోకములోవలెనే బోధకలోకమందును మేఁకవన్నె పులులు లేకపోలేదు. కాని, పరుల సంకుచితాశయములు పామరకృత్యములు వొరవడిగఁ గైకొనవలఁ దని సదా నేను మానసబోధ గావించుకొను వాఁడను. కీర్తిధనాదులను పరమావధిగ నెంచక, వృత్తి నిర్వహణమె ధర్మనిర్వహణముగఁ జేకొని మఱి విద్యాబోధన మొనరింపఁ బ్రయత్నించుచు వచ్చితిని. జ్ఞానస్వీకారమున నుత్తేజిత చేతస్కులగు శిష్యుల ముఖావలోకనము నిరతము నాకుఁ గనులపండువుగ నుండెడిది. కాని, యిది రానురాను క్రమశిక్షణధర్మ నిర్వహణములకు భంగకరమగు సుఖలోలత్వవ్యసనముగఁ బరిణమించిన తరుణము వృత్తివిరామమున కద నని గ్రహించి, విశ్రాంతి చేకొంటిని."

సుబోధకుడు : - విద్యార్థిదశయందు మిత్రాదులు "సుబోధకుడు" అని వేంకటశివుడుగారికి చేసిన నామకరణము జీవయాత్రయం దారూఢమైనది. వారు విజయవాడయం దుపాధ్యాయవృత్తి నుపక్రమించి, నెల్లూరునందు విరమించిరి. విజయవాడ,