పుట:2015.373190.Athma-Charitramu.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

33. క్రొత్తకోడలు, క్లిష్టపరిస్థితులు 149

ఇపుడు నా సంస్కరణాభిమానము, వేరుదన్ని మొగ్గతొడిగిన పూలమోకయై, సంస్కారప్రియులకు నయనాకర్షకమైనను, ప్రశాంత జీవితము గడపఁగోరు పూర్వాచారపరులగు జననీజనకులకుఁ గంటక వృక్ష మయ్యెను ! నా సావాసులు కనకరాజు మృత్యుంజయరావు మున్నగువారల సమాచారము తలిదండ్రులు మొదలగువారు చెప్పుకొనునపుడు వినిన నాభార్య, సంస్కారదేవత మూర్తీభవించినట్లు వా రిపుడు నన్నుఁ జూడ మాయింటికి వచ్చునప్పుడు, పతివిపరీత భావములకు వీరు పట్టుగొమ్మగదా యని భయభ్రాంత యగుచుండెను ! నా "సత్యసంవర్థనీ"పత్రికాప్రచురణము కుటుంబపుగుట్టును రచ్చఁబెట్టెను. అనుదినమును వీథిని పతియే రెలుగెత్తి యఱచి, జాబులు పత్రికలును దెచ్చి యిచ్చు తపాలజవానుకేక, పెనిమిటి సంఘసంస్కర్త యని లోకమునకు సాటెడివానిశబ్దమై, తనగుండియ కదరు గలిపించె నని క్రొత్త కోడలిమొఱ " "సత్యసంవర్థని"యందలి వ్రాఁతలు నింటఁ జిన్నలు పెద్దలును జదువునపు డెల్ల, భర్త మాయాసంస్కరణకూపమున మఱింతఁ గూరుకొనిపోవుచున్నాఁ డని తలంచి యాబాలిక భీతిల్లు చుండును !

ఇంక, తీవ్రసంఘసంస్కరణాభిమానమునఁ దేజరిల్లు పతిని గూర్చి యొకింతఁ బ్రస్తావింపవలెను. అతనిసంస్కరణాభినివేశ మిల్లు కట్టుకొని వసియింప వసుమతి నవకాశము లేనటు లుండెను ! గృహస్థాశ్రమారంభదశలో తనసతికి సంస్కరణ సుముఖత చేకూరుపట్ల నెట్టిప్రతిబంధము నుండఁగూడ దని యాతనిపట్టు ! మొదలు, పూర్వాచారపరాయణత్వము ప్రబలియుండు సమష్టికుటుంబజీవితమే యతని కనిష్టముగ నుండెను ప్రథమమునుండియు తనభార్య విద్యావికాసము