పుట:2015.373190.Athma-Charitramu.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 134

కును, తెల్ల వాఱుసరికి శకటవ్యాపారసందర్భమునఁ జేతులకుఁ బనియు, మనస్సున కలజడియు సమృద్ధిగఁ జేకూరెను ! ఒకరియెద్దులకంటె నొకరివి మంచి వనియు, ఒకరిబండికంటె నొకరిదాని కెక్కువలాభము వచ్చు ననియు నెంచెడి యీర్ష్యాజనకములగు నభిప్రాయములు గలిగి, పరస్పరస్నేహసౌహార్దములకు భంగకరము లగు పరిస్థితు లేర్పడెను !

నేను చెన్నపురినుండి యింటికి వచ్చునప్పటికి, నాకీ క్రొత్త సంగతు లన్నియు ద్యోతకమయ్యెను. తన వ్యవహారదక్షతనుగుఱించియు, మా కుటుంబమున కిపుడు గలుగు ధనలాభమునుగూర్చియు మా తండ్రి నాకుఁ జెప్పఁదొడంగెను ! నాకుమాత్రము మాకుటుంబమున కింతసులభముగ నే గొప్పయదృష్టమును పట్టునను నమ్మకము లేదు ! మా యదృష్టముమాట యటుంచి, మా జనకుని యాలోచనాసౌష్ఠవమునుగూర్చి విచారించినను, నా మనస్సున కేమియు సంతృప్తి గలుగదయ్యెను. ఆయన వ్యాపారకౌశలమునుగూర్చి నాచిన్న తనమున రేలంగిలో నొకగాథ వినుచుండువాఁడను. ఇప్పటివలెనే మాతండ్రి యపుడును ఉద్యోగము చాలించుకొని, యింట దినములు గడపుచుండెను. ఆ కాలమున చింతపండు అమితప్రియ మయ్యెనఁట. వీసె ముప్పావలా దాఁటిపోయెను. ఒకటేల, చింతపండుధర హెచ్చుచుండుటచేత, వర్తకులు దానిలో ఖర్జూరపుపండు మిశ్రమము చేసి యమ్మి లాభము గడించుచుండిరి ! ఈతరుణమున చింతపండువర్తకము చేసి మంచిలాభ మేల సంపాదింపరాదని మా తండ్రిమనస్సునకు స్ఫురించెను. ఇట్టి వ్యాపారపరిశ్రమమం దీయనకుఁ దీసిపోని ప్రజ్ఞానుభవములుగల యాయనపెద్దయన్న దీనికి వల్లె యనెను ! అంత మా నాయన రాజమంద్రి వెళ్లి, కొన్ని కంట్లముల చింతపండుకొని, రహదారిపడవమీఁద సరకు రేలంగి తీసికొనివచ్చెను. ఈబుట్టల యమ్మకమున మితిమీఱిన లాభము