పుట:2015.373190.Athma-Charitramu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆర్థిక ప్రయోజనములు, రాజ్యాంగనిర్మాణములు శిథిలములై, జీవయాత్రయందు నవీనాదర్శ ప్రయోజనము లుదయించినవి. దేశమునందు ప్రార్థనాసమాజములు, స్త్రీపునర్వివాహములు, పత్రికాప్రచురణములు, నూతనసాహిత్యరచనలు, ఆంగ్లవిద్యాలయములు, రాజకీయోద్యోగములు, నవీనవృత్తులు, పాశ్చాత్యవిజ్ఞానాభిమానమును నవజీవన నిర్మాణమున కుత్తేజమును గలుగజేసినవి. దేశావృతమైన సంస్కార పరివర్తనమునకు శ్రీయుత వీరేశలింగము పంతులుగారి జీవితచరిత్రము ప్రమాణముగ నున్నది. వేంకటశివుడుగారి జీవయాత్రానుసంధానమునకు, కాల మహిమకుతోడు, రాజమహేంద్రనివాసము, విద్యాభ్యాసము, వీరేశలింగము పంతులుగారి సాహచర్య సాంగత్యములు వినియోగపడినవిధమును ఆత్మ చరిత్రోదంతము విశదముచేయుచున్నది. జీవయాత్రయం దాత్మోపలబ్ధికి గృహరంగము బీజము; విద్యారంగము శక్తి; విశ్వరంగము కీలకము. మహాత్ములకువలె సామాన్యులకును నీరంగములు పురుషార్థసిద్ధికి వినియోగపడగల విధమును జీవితచరిత్రములం దాత్మచరిత్రము బోధించుచున్నది.

గృహరంగము: - ఆత్మచరిత్రములకు గృహరంగములు సుక్షేత్రములు. బాల్యమునందు గృహక్షేత్రము