పుట:2015.373190.Athma-Charitramu.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 120

సంస్కృతభాషాపాండిత్యము, పూర్వాచార పరాయణత్వమును సమృద్ధిగగలవారే శాస్త్రిమెప్పు వడయువారలు !

ఈ యన్నిటియందును శాస్త్రికి నాకును చుక్కయెదురే ! కాని, ఈ దుసమయమున, మా సామరస్యమును భంగపఱిచెడి చర్య లెవ్వియు నే నవలంబింపరాదు. నే నిట్లు తలపోసితిని : - "ఇంట నే నిపుడు తటస్థముగ నుండి, యెట్టిచర్యలలోను పాల్గొనక, కాలమును శక్తియుక్తులను నిక్షేపించుకొనుచున్నాను. శాస్త్రివంటి మనస్తత్వము గలవారితోఁగూడ వాగ్వాదములు పెట్టుకొన నిది యదను గాదు. దైవానుగ్రహ మున్నచో, పిమ్మట నిట్టివారలకుఁ దగు సమాధానము చెప్పితీరెదను. ఇదిగాక, సగము మతి చెడి దివ్యజ్ఞానవిశ్వాసకు లైన కాంతయ్య లక్ష్మీనారాయణగార్ల కీతఁడు కూరిమి నెయ్యుఁడే కదా."

తన సమాచార మిట్టి దయ్యును, శాస్త్రి యూరకుండువాఁడు కాఁడు. అపుడపు డతఁడు సంస్కారప్రియత్వమును సూచించుమాటలు మాటాడి, తాను విశాలమనస్కునివలెఁ బ్రసంగింప వెనుదీయఁడు. కాని, యొక్కొకతఱి నీతఁడు, అగ్ని పర్వతమువలె సంస్కర్తలమీఁద నిప్పులు గ్రక్కుచుండును !

డిశంబరు 5, 6, తేదీలందు, అధికముగఁ జదువుటవలన నేను శ్రమఁ జెందితిని. పెందలకడనే పుస్తకములు మూలఁ ద్రోచి ధవళేశ్వరమువైపునకు గోదావరియొడ్డున నేను షికారుపోయితిని. పచ్చనిచెట్లు, పండఁబాఱిన సస్యములును జూచి నా కనులు సేద దేఱెను. కొమ్మలమీఁది పక్షులరుతములు, సేద్యగాండ్ర కూనరాగములు, నా వీనులకు శ్రావ్యసంగీతనాదము లయ్యెను. వ్యవసాయకులు