పుట:2015.373190.Athma-Charitramu.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 118

సమీపించుచున్నది. ఇంతవఱకు మన మేకార్యమును జేయలేదు. ముందును విద్యయందే మన మనస్సులు లగ్న మైయున్నచో, జీవితారంభదశనే మన మీలోకమును వీడవలసియుండు నేమో!" యని నే నంటిని.

30 వ తేది సాయంకాలమున నేను షికారుపోవుచు, చీఁకటి పడుచుండుటచే మార్కండేయాలయము చొచ్చి యొకవేదికపైఁ గూర్చుండి, యందలి సందడిని గనిపట్టుచుంటిని. కోమట్లు కర్షకులు ననేకులు గుడిలోనికి వచ్చి గంట కొట్టి దేవునికిఁ బ్రణమిల్లుచుండిరి. విద్యార్థులును నచటఁ గలరు. వారిపూజలు నేను నిరసింపక, యేమియు లేనిదానికంటె నీమాత్రము భక్తి మంచిదిగదా యని తలపోసితిని. దేవాలయప్రవేశము, విభూతిధారణము, జేగంటకొట్టి నందికి నమస్కరించుట, కనులు మూసి యొకింతసేపు దేవుని స్మరించుట, పూజారిచే శఠగోపము పెట్టించుకొని వానిచేతఁ గొంతరాలిపి బిల్వపత్రము లందుకొనుట, - ఇదియే యచట జరిగెడి కార్యప్రణాళిక !

హృదయాంతర్యామి యగు పరమాత్ముని మదిలో దర్శించి, విశుద్ధప్రవర్తన మూని యుండుట పరమార్థ మని ప్రజ లెపుడు గ్రహింతురా యని నేను బరితపించితిని.

2 వ నవంబరు : - ఈదిన మంతయు దేహమున ససిగాలేదు. పరీక్షలోని యేవిషయమును నేను బాగుగఁ జదువకుండుటచే, అందు జయ మందుదు నను ఆశ యంతరించిపోయినది. ఎక్కువగఁ జదివి యారోగ్యము చెడఁగొట్టుకొనుటకు నేనిపుడు సమకట్టలేదు. పిలిచినచో నాదేహమునుండి రోగము పలుకుచున్నటు లుండెను ! పెందలకడనే పుస్తకము మూసివైచి, వ్యాయామమున కేగితిని. కాని, దారిలో చెలి